గొంతుకు యమ గిరాకీ | Kamal Haasan to Give Voice Over for Ajith's 'Thala 55'? | Sakshi
Sakshi News home page

గొంతుకు యమ గిరాకీ

Published Wed, Oct 8 2014 10:46 PM | Last Updated on Sat, Sep 2 2017 2:32 PM

గొంతుకు యమ గిరాకీ

గొంతుకు యమ గిరాకీ

 గౌతమ్ మీనన్ చిత్రంలో కమల్‌హాసన్ పని చేస్తున్నారట. ఇప్పుడు చెన్నైలో ఇదే చర్చ జరుగుతోంది. ఇప్పటికే, ‘ఉత్తమ విలన్’, ‘పాపనాశమ్’ చిత్రాలతో తీరిక లేకుండా ఉన్న కమల్ మూడో సినిమా చేస్తున్నారేమిటా అని ఆశ్చర్యపోకండి. కమల్‌హాసన్ తన గంభీర స్వరాన్ని గౌతమ్ మీనన్ చిత్రానికి అందించనున్నారట. అజిత్ హీరోగా తాను దర్శకత్వం వహి స్తున్న చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలకు గంభీరమైన కంఠస్వరం ఉన్నవారితో వాయిస్ ఓవర్ చెప్పించాలని గౌతమ్ మీనన్ అనుకున్నారట.
 
  కమల్ అయితే బాగుంటుందని ఆయన భావించారట. కమల్ దగ్గర గౌతమ్ ఈ విషయం చెప్పారని భోగట్టా. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో కమల్ ‘వేట్టయాడు విళయాడు’ (తెలుగులో ‘రాఘవన్’) అనే చిత్రంలో నటించారు. అప్పటి నుంచీ ఇద్దరి మధ్య సత్సంబంధాలున్నాయి. సో... గౌతమ్ ప్రతిపాదనకు కమల్ పచ్చజెండా ఊపుతారని ఊహించవచ్చు. ఇది ఇలా ఉండగా, సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మీనన్ సహాయకుడైన విజయ్ విల్వక్రిష్ తొలిసారిగా రూపొందిస్తున్న తమిళ చిత్రం ‘అవమ్’లో కమల్ ఓ రాక్ సాంగ్ పాడారట. వరుస చూస్తుంటే, తమిళనాట కమల్ గొంతుకు ఇప్పుడు బాగా గిరాకీ ఉన్నట్లుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement