చిరంజీవిగారా...అవన్నీ పుకార్లే: రాజమౌళి
బాహుబలి-2 చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ ఆ సినిమా మీద ఏదో ఒక వార్త బయటకు వస్తూనే ఉంది. తాజాగా ఆ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ అందిస్తున్నట్లు వస్తున్న పుకార్లను ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి స్పందించారు. చిరంజీవి వాయిస్ ఇస్తారని వస్తున్న వార్తలు అవాస్తవమని ఆయన అన్నారు. ఈ మేరకు రాజమౌళి తన ట్విట్టర్ అకౌంట్ లో స్పష్టం చేశారు. కాగా గత రెండురోజులుగా చిరంజీవి వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లు భారీగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే జక్కన్న ఆ వార్తలపై క్లారిటీ ఇవ్వడంతో ఎట్టకేలకు ఆ రూమర్లకు ఫుల్‌స్టాఫ్ పడింది.
బాహుబలి టీమ్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో పాటు ప్రమోషన్ పనులు కూడా బిజీగా ఉన్నారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 28న ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. ఇక విడుదలకు ముందే బాహుబలి-2 దాదాపు రూ.500 కోట్ల బిజినెస్ చేసినట్లు చిత్ర వర్గాల అంచనా. తొలి భాగం కంటే సెకండ్ పార్ట్ మరింత ఆసక్తి ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా బాహుబలి చిత్రంలో అమరేంద్ర బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే విషయంలో కూడా ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. బాహుబలి-2 విడుదలైతే కానీ ఆ అనుమానానికి నివృత్తి దొరకదు మరి.
Chiranjeevigaru giving voice over for Baahubali2 is false news..
— rajamouli ss (@ssrajamouli) 6 March 2017