Baahubali2
-
బాహుబలి-2పై నాగ్ ఏమన్నారంటే..
హైదరాబాద్: రికార్డులతో మోత మోగిస్తున్న రాజమౌళి ప్రతిష్టాత్మక సినిమా బాహుబలి-2 (ది కన్‌క్లూజన్) పై టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున స్పందించారు. సోమవారం ట్విట్టర్ ద్వారా ఈ చిత్ర విజయంలో ప్రధాన భూమిక పోషించిన నటీనటులకు శుభాకాంక్షలు తెలిపారు. గత అదేళ్లుగా వీరు చూపించిన డెడికేషన్ అద్భుతమని కొనియాడారు. ప్రభాస్, అనుష్క, రానా దగ్గుబాటి , రమ్యకృష్ణన్లను ప్రత్యేకంగా అభినందించారు. వీరంతా బాహుబలి -2 కోసం అయిదు సం.రాల పాటు నిబద్ధతతో పనిచేయడం అభినందనీయమన్నారు. జస్ట్ ఇన్క్రెడిబుల్.. అంటూ ట్వీట్ చేశారు. అటు నాగార్జున్ ట్వీట్ కు దర్శకుడు రాజమౌళి స్పందించారు. తమ చిత్ర బృందం తరపున ధన్యవాదాలు తెలిపారు. కాగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ తదితరులు నటించిన ఈ సినిమా ప్రతిరోజూ సరికొత్త రికార్డులతో దూసుకుపోతోంది. Prabhas,Anushka, @RanaDaggubati @meramyakrishnan..you guys were just incredible!!your dedication towards #Baahubali2 for the last 5 yrs -
బాహుబలి-2పై కేంద్ర మంత్రి కామెంట్
న్యూఢిల్లీ: టాలీవుడ్ మూవీ 'బాహుబలి: ది కంక్లూజన్' మేనియా ఎలా ఉందంటే.. ఈ మూవీ గురించి సాధారణ ప్రేక్షకులు, సినీ ప్రముఖులతో పాటు ప్రజా ప్రతినిధులు సైతం ఈ అద్భుత ప్రాజెక్టుపై తమ అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్నారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు బాహుబలి-2 మూవీపై సోషల్ మీడియాలో స్పందించారు. భారతీయ సినిమా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత బాహుబహలి-2కి దక్కిందని ప్రశంసించారు. ప్రాంతీయ భాషా చిత్రం(తెలుగు) గా వచ్చినా మన గొప్పతనాన్ని విదేశాలలో చాటి చెప్పేలా తెరకెక్కించిన మూవీ యూనిట్‌ను ట్విట్టర్ ద్వారా అభినందించారు. మరోవైపు నిన్న (శుక్రవారం) విడుదలైన బాహుబలి-2 తొలిరోజు వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి దూసుకుపోతోంది. తొలిరోజు కేవలం భారత మార్కెట్ లోనే బాహుబలి-2 ఏకంగా 125 కోట్ల కలెక్షన్లు సాధించి రికార్డ్ ఆల్ టైం రికార్డ్‌ను సెట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 55 కోట్లు, హిందీలో రూ. 38 కోట్లు, కర్ణాటకలో రూ. 12 కోట్లు, కేరళలో రూ. 9 కోట్లు, తమిళనాట రూ. 11 కోట్ల వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు. ప్రతిష్టాత్మక బాహుబలి ప్రాజెక్టులు తెరకెక్కించిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళికి దేశ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. #baahubali2 has taken Indian Cinema to entirely new level and coming from regional language (Telugu) team is all the more praiseworthy. — M Venkaiah Naidu (@MVenkaiahNaidu) 29 April 2017 -
కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలిసింది..
హైదరాబాద్ : యావత్తు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'బాహుబలి: ది కంక్లూజన్' సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సినిమా చూసినవారంతా అద్భుతంగా ఉందని చెబుతున్నారు. భావోద్వేగాలు చాలా బాగా పండాయని అంటున్నారు. మరో వైపు టాలీవుడ్ ప్రముఖులు బాహుబలి2 పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మంచు లక్ష్మీ, అడవి శేషు, రకుల్ ప్రీత్ సింగ్, రెజీనా, సుశాంత్ తదితరులు బాహుబలి2 మొదటి రోజు మొదటి షో చూశారు. ఎట్టకేలకు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలిసిపోయింది అంటూ నటి మంచు లక్ష్మీ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. -
టికెట్ల కోసం ఐమ్యాక్స్ వద్ద భారీ క్యూ లైన్
-
చిరంజీవిగారా...అవన్నీ పుకార్లే: రాజమౌళి
బాహుబలి-2 చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ ఆ సినిమా మీద ఏదో ఒక వార్త బయటకు వస్తూనే ఉంది. తాజాగా ఆ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ అందిస్తున్నట్లు వస్తున్న పుకార్లను ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి స్పందించారు. చిరంజీవి వాయిస్ ఇస్తారని వస్తున్న వార్తలు అవాస్తవమని ఆయన అన్నారు. ఈ మేరకు రాజమౌళి తన ట్విట్టర్ అకౌంట్ లో స్పష్టం చేశారు. కాగా గత రెండురోజులుగా చిరంజీవి వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లు భారీగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే జక్కన్న ఆ వార్తలపై క్లారిటీ ఇవ్వడంతో ఎట్టకేలకు ఆ రూమర్లకు ఫుల్‌స్టాఫ్ పడింది. బాహుబలి టీమ్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో పాటు ప్రమోషన్ పనులు కూడా బిజీగా ఉన్నారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 28న ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. ఇక విడుదలకు ముందే బాహుబలి-2 దాదాపు రూ.500 కోట్ల బిజినెస్ చేసినట్లు చిత్ర వర్గాల అంచనా. తొలి భాగం కంటే సెకండ్ పార్ట్ మరింత ఆసక్తి ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా బాహుబలి చిత్రంలో అమరేంద్ర బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే విషయంలో కూడా ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. బాహుబలి-2 విడుదలైతే కానీ ఆ అనుమానానికి నివృత్తి దొరకదు మరి. Chiranjeevigaru giving voice over for Baahubali2 is false news.. — rajamouli ss (@ssrajamouli) 6 March 2017 -
చిరంజీవి వాయిస్ ఓవర్ ఇవ్వలేదు : రాజమౌళి
నేషనల్ లెవల్లో భారీ హైప్ క్రియేట్ చేస్తున్న బాహుబలి 2 చిత్రానికి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇస్తున్నారని వస్తున్న వార్తలను దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఖండించారు. ఈ వార్తల్లో నిజం లేదని రాజమౌళి ట్విటర్ ద్వారా తెలిపారు. 'బాహుబలి 2 చిత్రానికి చిరంజీవిగారు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు.. అనేవి తప్పుడు వార్తలు' అని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ చిత్ర ఆడియో రిలీజ్ వేడుకను రామోజీ ఫిలిం సిటీలోనే మాహిష్మతి సెట్ దగ్గర ఉగాది రోజున భారీ ఎత్తున నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అది కుదరని పక్షంలో ఫిలిం సిటీలోనే మరోప్రాంతంలో ఆడియో వేడుకను నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆడియో విడుదలకు కావాల్సి ఏర్పాట్లు కూడా ప్రారంభించారన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న బాహుబలి 2 ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. Chiranjeevigaru giving voice over for Baahubali2 is false news.. — rajamouli ss (@ssrajamouli) March 6, 2017 -
బాహుబలి2 రెడీ అవుతున్న జక్కన్న