కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలిసింది..
హైదరాబాద్ :
యావత్తు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'బాహుబలి: ది కంక్లూజన్' సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సినిమా చూసినవారంతా అద్భుతంగా ఉందని చెబుతున్నారు. భావోద్వేగాలు చాలా బాగా పండాయని అంటున్నారు.
మరో వైపు టాలీవుడ్ ప్రముఖులు బాహుబలి2 పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మంచు లక్ష్మీ, అడవి శేషు, రకుల్ ప్రీత్ సింగ్, రెజీనా, సుశాంత్ తదితరులు బాహుబలి2 మొదటి రోజు మొదటి షో చూశారు. ఎట్టకేలకు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలిసిపోయింది అంటూ నటి మంచు లక్ష్మీ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.