machu laxmi
-
Lakshmi Manchu Birthday: టాలీవుడ్ నటి మంచులక్ష్మి అరుదైన ఫోటోలు చూశారా?
-
వైరల్: మంచు లక్ష్మీని టార్గెట్ చేసిన ఆర్జీవీ!
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కోరలు చాస్తుంది. దీంతో ఈ మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ 21 రోజుల పాటు దేశమంతట లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రధాని పిలుపు మేరకు సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకూ ఇంటికే పరిమితమయ్యారు. సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్న సెలబ్రిటీలంతా ఇంట్లో వారు సరదాగా గడుపుతున్న వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. అలాగే సామాన్య ప్రజలు సైతం ఏం చేయాలో తోచక టిక్‌టాక్‌లు చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. (‘ఫస్ట్ టైమ్ నెలకు 1000 రోజులు’) Taking a break from the coronavirus can anybody tell me who the little girl is imitating??? pic.twitter.com/aKDB1TZJ7e — Ram Gopal Varma (@RGVzoomin) March 29, 2020 ఈ క్రమంలో ఓ చిన్నారి, వాళ్ల అమ్మతో కలిసి చేసిన టిక్‌టాక్ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఆ చిన్నారి వాళ్ల అమ్మ మిల్క్ తాగుతావా అని అడిగితే ఆ పాప మంచు లక్ష్మీని ఇమిటేట్ చేస్తుంది. ఈ వీడియోను వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ షేర్ చేస్తూ.. ‘కరోనా వైరస్ నుంచి కాస్తా విరామం తీసుకోండి. ఈ పాప ఎవరో మీకు తెలిస్తే నాకు కాస్తా చెప్పండి’ అంటూ ట్విటర్లో షేర్ చేశాడు. ఇక ఆర్జీవీ ట్వీట్ చూసి మంచు లక్ష్మీ ‘సార్ అంటూ(Sarrr) అంటూ కామెంట్ చేశాడు. ఇక రిషీ తమ్ముకుంటా అనే నెటిజన్ ‘సర్ర్ కాదు సార్.. ఆర్ షూడ్ బీ రోలింగ్’ అంటూ సరదాగా కామెంటు పెట్టాడు. అంతేగాక లక్ష్మీని ఇమిటేట్ చేస్తున్న మరిన్ని టిక్‌టాక్ వీడియోలను నెటిజన్లు షేర్ చ్తేస్తున్నారు. ఎప్పుడు ఎవరిపై వంగ్యస్త్రాలు వదులుతారో తెలియని ఈ వివాదస్పద దర్వకుడు తాజాగా మంచు లక్ష్మీని టార్గెట్ చేసి ఆటపట్టించాడు. -
కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలిసింది..
హైదరాబాద్ : యావత్తు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'బాహుబలి: ది కంక్లూజన్' సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సినిమా చూసినవారంతా అద్భుతంగా ఉందని చెబుతున్నారు. భావోద్వేగాలు చాలా బాగా పండాయని అంటున్నారు. మరో వైపు టాలీవుడ్ ప్రముఖులు బాహుబలి2 పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మంచు లక్ష్మీ, అడవి శేషు, రకుల్ ప్రీత్ సింగ్, రెజీనా, సుశాంత్ తదితరులు బాహుబలి2 మొదటి రోజు మొదటి షో చూశారు. ఎట్టకేలకు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలిసిపోయింది అంటూ నటి మంచు లక్ష్మీ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.