బాహుబలి-2పై కేంద్ర మంత్రి కామెంట్
న్యూఢిల్లీ: టాలీవుడ్ మూవీ 'బాహుబలి: ది కంక్లూజన్' మేనియా ఎలా ఉందంటే.. ఈ మూవీ గురించి సాధారణ ప్రేక్షకులు, సినీ ప్రముఖులతో పాటు ప్రజా ప్రతినిధులు సైతం ఈ అద్భుత ప్రాజెక్టుపై తమ అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్నారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు బాహుబలి-2 మూవీపై సోషల్ మీడియాలో స్పందించారు. భారతీయ సినిమా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత బాహుబహలి-2కి దక్కిందని ప్రశంసించారు. ప్రాంతీయ భాషా చిత్రం(తెలుగు) గా వచ్చినా మన గొప్పతనాన్ని విదేశాలలో చాటి చెప్పేలా తెరకెక్కించిన మూవీ యూనిట్‌ను ట్విట్టర్ ద్వారా అభినందించారు.
మరోవైపు నిన్న (శుక్రవారం) విడుదలైన బాహుబలి-2 తొలిరోజు వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి దూసుకుపోతోంది. తొలిరోజు కేవలం భారత మార్కెట్ లోనే బాహుబలి-2 ఏకంగా 125 కోట్ల కలెక్షన్లు సాధించి రికార్డ్ ఆల్ టైం రికార్డ్ను సెట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 55 కోట్లు, హిందీలో రూ. 38 కోట్లు, కర్ణాటకలో రూ. 12 కోట్లు, కేరళలో రూ. 9 కోట్లు, తమిళనాట రూ. 11 కోట్ల వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు. ప్రతిష్టాత్మక బాహుబలి ప్రాజెక్టులు తెరకెక్కించిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళికి దేశ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
#baahubali2 has taken Indian Cinema to entirely new level and coming from regional language (Telugu) team is all the more praiseworthy.
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) 29 April 2017