చిరంజీవి వాయిస్ ఓవర్ ఇవ్వలేదు : రాజమౌళి
నేషనల్ లెవల్లో భారీ హైప్ క్రియేట్ చేస్తున్న బాహుబలి 2 చిత్రానికి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇస్తున్నారని వస్తున్న వార్తలను దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఖండించారు. ఈ వార్తల్లో నిజం లేదని రాజమౌళి ట్విటర్ ద్వారా తెలిపారు. 'బాహుబలి 2 చిత్రానికి చిరంజీవిగారు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు.. అనేవి తప్పుడు వార్తలు' అని ట్విట్టర్లో పేర్కొన్నారు.
ఈ చిత్ర ఆడియో రిలీజ్ వేడుకను రామోజీ ఫిలిం సిటీలోనే మాహిష్మతి సెట్ దగ్గర ఉగాది రోజున భారీ ఎత్తున నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అది కుదరని పక్షంలో ఫిలిం సిటీలోనే మరోప్రాంతంలో ఆడియో వేడుకను నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆడియో విడుదలకు కావాల్సి ఏర్పాట్లు కూడా ప్రారంభించారన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న బాహుబలి 2 ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.
Chiranjeevigaru giving voice over for Baahubali2 is false news..
— rajamouli ss (@ssrajamouli) March 6, 2017