Nani To Romance Mrunal Thakur In His Next Movie - Sakshi
Sakshi News home page

తండ్రీకూతుళ్ల అనుబంధం

Published Mon, Jan 2 2023 4:34 AM | Last Updated on Mon, Jan 2 2023 9:18 AM

Nani to romance Mrunal Thakur in his next - Sakshi

హీరో నాని కొత్త సంవత్సరం కొత్త సినిమా కబురు చెప్పారు. నాని హీరోగా శౌర్యువ్‌ను దర్శకునిగా పరిచయం చేస్తూ, వైర ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై చెరుకూరి వెంకట మోహన్, డా.విజయేందర్‌రెడ్డి, మూర్తి కలగర ఓ సినిమా నిర్మించనున్నారు. ఈ చిత్రంలో ‘సీతారామం’ ఫేమ్‌ మృణాళ్‌ ఠాకూర్‌ హీరోయిన్‌.

న్యూ ఇయర్‌ సందర్భంగా ఆదివారం ఈ సినిమా ప్రకటించి, నాని వాయిస్‌ ఓవర్‌తో ఓ వీడియోను రిలీజ్‌ చేశారు. ఈ సినిమా తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో సాగే ఎమోషనల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అని గ్లింప్స్‌ను బట్టి తెలుస్తోంది. నాని కెరీర్‌లో 30వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీకి మలయాళ మ్యూజిక్‌ డైరెక్టర్‌ హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌ స్వరకర్త. ఈ సినిమాకు కెమెరా: సాను జాన్‌ వర్గీస్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఈవీవీ సతీష్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement