టీనేజ్‌ గుర్తొచ్చింది! Ananya Panday Lends Voice To Riley In Inside Out 2 Hindi Version | Sakshi
Sakshi News home page

టీనేజ్‌ గుర్తొచ్చింది!

Published Tue, Jun 4 2024 12:02 AM | Last Updated on Tue, Jun 4 2024 12:02 AM

Ananya Panday Lends Voice To Riley In Inside Out 2 Hindi Version

టీనేజ్‌ జ్ఞాపకాలు గుర్తొచ్చాయని సంబరపడిపోతున్నారు బాలీవుడ్‌ యంగ్‌ హీరోయిన్‌ అనన్యా పాండే. హఠాత్తుగా అనన్యా పాండేకు టీనేజ్‌ జ్ఞాపకాలు గుర్తుకు రావడానికి కారణం ‘ఇన్‌సైడ్‌ అవుట్‌ 2’ అనే అమెరికన్‌ యానిమేటెడ్‌ ఫిల్మ్‌. కెల్సీ మన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హాలీవుడ్‌ తారలు అమీ పోహ్లర్, ఫిలిస్‌ స్మిత్, లూయిస్‌ బ్లాక్, టోనీ హేల్‌ వంటి వారు ఈ సినిమాలోని హ్యాపీ, సాడ్‌నెస్, యాంగర్‌ వంటి ఎమోషన్స్‌కు వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు.

రిలే ఆండర్సన్‌ అనే ఓ 13 ఏళ్ల టీనేజ్‌ అమ్మాయి పాత్రకు హిందీ వెర్షన్‌లో వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు అనన్యా పాండే. సినిమాలో కెన్సింగ్టన్‌ తాల్మన్‌ ఈ పాత్ర చేసింది. రిలే ఆండర్సన్‌కు  వాయిస్‌ ఓవర్‌ ఇచ్చిన సందర్భంగా అనన్యా పాండే మాట్లాడుతూ– ‘‘పిక్సర్‌ అండ్‌ డిస్నీ స్టూడియోల యానిమేషన్‌ చిత్రాలకు నేను అభిమానిని. ఈ సంస్థల నుంచి వస్తున్న ‘ఇన్‌సైడ్‌ అవుట్‌ 2’కి వాయిస్‌ ఓవర్‌ ఇవ్వడం హ్యాపీగా ఉంది. రిలే పాత్రకు వాయిస్‌ ఓవర్‌ చెబుతున్నప్పుడు నాకు నా టీనేజ్‌ గుర్తొచ్చింది’’ అని పేర్కొన్నారు. కాగా ‘ఇన్‌సైడ్‌ అవుట్‌ 2’ ఈ నెల 14న రిలీజ్‌ కానుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement