పూర్ణ.. బంటి... ఓ పాట | Poorna to feature in special song in 'Adhugo' | Sakshi
Sakshi News home page

పూర్ణ.. బంటి... ఓ పాట

Published Mon, Sep 17 2018 3:17 AM | Last Updated on Mon, Sep 17 2018 3:17 AM

Poorna to feature in special song in 'Adhugo' - Sakshi

పూర్ణ

‘సీమటపాకాయ్, అవును, లడ్డుబాబు, జయమ్ము నిశ్చయమ్మురా’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు కథానాయిక పూర్ణ. తాజాగా ఆమె ‘అదుగో’ చిత్రంలో ఓ ప్రత్యేక పాటలో నటించారు. బంటి అనే పంది పిల్ల లీడ్‌ రోల్‌లో ఈ చిత్రాన్ని సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో రవిబాబు స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. అభిషేక్‌ వర్మ, నభా, రవిబాబు, ఉదయ్‌ భాస్కర్, ఆర్కే, వీరేందర్‌ చౌదరి ఇతర పాత్రల్లో నటించారు.

పూర్ణ నటించిన ప్రత్యేక పాటను ఈ రోజు విడుదల చేస్తున్నారు. ఈ పాటలో పూర్ణతో పాటు టైటిల్‌ రోల్‌ చేస్తున్న బంటి అనే పందిపిల్ల కూడా కనిపించనుంది. రవిబాబు మాట్లాడుతూ– ‘‘ఈ పాట ప్రేక్షకులకు విజువల్‌ ట్రీట్‌ ఇవ్వబోతోంది. ప్రశాంత్‌ విహారి చక్కటి సంగీతం అందించాడు. ఈ చిత్రం ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. దసరా సెలవుల్లో సినిమాను  విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎన్‌. సుధాకర్‌ రెడ్డి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement