nabha
-
ఆ కష్టం అలవాటైపోయింది
‘‘అదుగో’ సినిమా కోసం రెండేళ్లు నటనకు దూరంగా ఉన్నా. ఈ గ్యాప్‌లో చాలా అవకాశాలొచ్చినా చేయలేకపోయా. ప్రస్తుతం నన్ను అందరూ మరచిపోయారని కొందరు అంటున్నారు. ‘అదుగో’ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్ర చేశా’’ అని రవిబాబు అన్నారు. పంది పిల్ల (బంటి) ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘అదుగో’. రవిబాబు, అభిషేక్, నభా ముఖ్య పాత్రలు చేశారు. నిర్మాత సురేశ్‌బాబు సమర్పణలో ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్లో రవిబాబు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా రేపు రిలీజవుతోంది. రవిబాబు చెప్పిన విశేషాలు. ► డిస్నీ సినిమాల స్ఫూర్తితో ఓ జంతువు లీడ్ రోల్లో సినిమా తీయాలనిపించింది. హాలీవుడ్ మూవీ ‘ప్లా నెట్ ఆఫ్ ఆది ఏప్స్’ సినిమా ఇష్టం. బడ్జెట్ దృష్ట్యా కోతులతో తెలుగులో సినిమా చేయడం సాధ్యం కాదు. ఏనుగు, ఈగ, ఎలుక, జీబ్రాతో పాటు అన్ని జంతువులతో మనవాళ్లు సినిమాలు చేశారు. పందితో హాలీవుడ్లో సినిమాలొచ్చాయి. కానీ, ఇండియాలో రాలేదు. అందుకే పందిని కథా వస్తువుగా ఎంచుకున్నా. ► పెద్దల మాట వినకుండా బయటి ప్రపంచంలో అడుగుపెట్టిన ఓ పందిపిల్లకు ఒక రోజులో ఎదురైన సంఘటనలను వినోదాత్మకంగా చూపిం చాం. ప్రతి పాత్ర వినోదం పంచుతుంది. కమర్షియల్‌గా ‘అదుగో’ రిస్క్‌తో కూడుకున్నది. ప్రతిసారి కొత్త కథతో తొలి సినిమాలా భావించి ప్రేక్షకుల్లోకి తీసుకురావడా నికి శ్రమిస్తుండటంతో ఆ కష్టం అలవాటైపోయింది. ► హాలీవుడ్లో జంతువులపై తీసే సినిమాలకు స్టార్స్ వాయిస్ ఓవర్ ఇస్తుంటారు. మన వద్ద ఆ సంస్కృతి లేదు. పంది పాత్రకు హీరోలతో డబ్బింగ్ చెప్పిస్తే ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత వస్తుందేమో? రాజేంద్రప్రసాద్‌గారిని అడిగితే బాగోదేమో అన్నారు. ఈ సినిమా ట్రెండ్‌సెట్టర్ అవుతుందని ఒప్పించా. ► ‘అదుగో’ గ్రాఫిక్స్‌తో తీసిన సినిమాలా అనిపించదు. ప్రస్తుతం చాలా కథలు సిద్ధం చేసుకున్నా. ‘అదుగో’ సినిమాకి ప్రేక్షకుల స్పందన చూసి, మరో నాలుగు భాగాలు చేసే ఆలోచన ఉంది. -
పూర్ణ.. బంటి... ఓ పాట
‘సీమటపాకాయ్, అవును, లడ్డుబాబు, జయమ్ము నిశ్చయమ్మురా’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు కథానాయిక పూర్ణ. తాజాగా ఆమె ‘అదుగో’ చిత్రంలో ఓ ప్రత్యేక పాటలో నటించారు. బంటి అనే పంది పిల్ల లీడ్ రోల్లో ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ సమర్పణలో రవిబాబు స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. అభిషేక్ వర్మ, నభా, రవిబాబు, ఉదయ్ భాస్కర్, ఆర్కే, వీరేందర్ చౌదరి ఇతర పాత్రల్లో నటించారు. పూర్ణ నటించిన ప్రత్యేక పాటను ఈ రోజు విడుదల చేస్తున్నారు. ఈ పాటలో పూర్ణతో పాటు టైటిల్ రోల్ చేస్తున్న బంటి అనే పందిపిల్ల కూడా కనిపించనుంది. రవిబాబు మాట్లాడుతూ– ‘‘ఈ పాట ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇవ్వబోతోంది. ప్రశాంత్ విహారి చక్కటి సంగీతం అందించాడు. ఈ చిత్రం ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. దసరా సెలవుల్లో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎన్. సుధాకర్ రెడ్డి. -
దసరాకి అదుగో
రవిబాబు నటించి, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘అదుగో’. ఈ సినిమాలో ఓ పందిపిల్ల కీలక పాత్రలో నటించడం విశేషం. సురేశ్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఏ ఫ్లైయింగ్ ఫ్రాగ్ బ్యానర్లో రవిబాబు నిర్మించిన ఈ సినిమా దసరాకి రానుంది. రవిబాబు మాట్లాడుతూ– ‘‘కుటుంబ ప్రేక్షకులు, పిల్లలను బాగా ఆకట్టుకునే కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలిసారి పూర్తి స్థాయి లైవ్ యాక్షన్ 3డి యానిమేషన్‌ను చూపించబోతున్నాం. అందరికీ కనెక్ట్ అయ్యే యూనిక్ కాన్సెప్ట్ కావడంతో అన్ని భారతీయ భాషల్లో ఈ చిత్రం విడుదల చేస్తున్నాం. తెలుగులో ‘అదుగో’ టైటిల్‌తో రిలీజ్ కానున్న ఈ సినిమా మిగిలిన భాషల్లో ‘బంటి’ పేరుతో విడుదలవుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి దసరా సెలవుల్లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు. అభిషేక్ వర్మ, నభా, ఉదయ్ భాస్కర్, ఆర్కే, వీరేందర్ చౌదరి నటించిన ఈ చిత్రానికి సంగీతం: పశ్రాంత్ ఆర్. విహార్, కెమెరా: ఎన్.సుధాకర్ రెడ్డి. -
కుప్పకూలిన హై సెక్యూరిటీ జైలు గోడ
పంజాబ్ లోని అత్యంత సురక్షితమైన జైలుగా భావించే నాభా హై సెక్యూరిటీ జైలు గోడ ఉన్నట్టుండి తనంతట తానే కుప్పకూలిపోయింది. 200 అడుగుల పొడవు, 15 అడుగుల ఎత్తు ఉన్న ఈ గోడ ఎలా కూలిపోయిందన్నది అధికారులకు అర్థం కావడం లేదు. ఈ గోడ మూడడుగుల మందం ఉన్న భారీ గోడ. ఈ జైలులో 50 మంది కరడుగట్టిన ఖలిస్తానీ తీవ్రవాదులున్నారు. దీంతో అధికారులు హుటాహుటిన 33 మందిని సంగ్రూర్ లోని వేరే జైలుకు తరలించారు. మరో 17 మందిని గురువారం తరలించనున్నారు. ఈ జైల్లో మొత్తం 498 మంది ఖైదీలున్నారు. ఇప్పుడు దశలవారీగా వారిని కూడా తరలించడం జరుగుతోంది. అయితే ఇందులో కుట్ర కోణం ఉండకపోవచ్చునని అధికారులు అంటున్నారు. ఈ గోడ 90 ఏళ్ల నాటిది కావడంతో పాతబడి, దానంతట అదే కూలి ఉండొచ్చని వారంటున్నారు. అలాగైతే ఈ పాటికి ఎర్రకోట, చార్మినార్, కుతుబ్ మీనార్లు కూడా కూలిపోయి ఉండాలి కదా అంటోంది విపక్షం.