కుప్పకూలిన హై సెక్యూరిటీ జైలు గోడ | High security prison wall collapses | Sakshi

కుప్పకూలిన హై సెక్యూరిటీ జైలు గోడ

Published Thu, Apr 3 2014 3:07 PM | Last Updated on Sat, Sep 2 2017 5:32 AM

పంజాబ్ లోని అత్యంత సురక్షితమైన జైలుగా భావించే నాభా హై సెక్యూరిటీ జైలు గోడ ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది.

పంజాబ్ లోని అత్యంత సురక్షితమైన జైలుగా భావించే నాభా హై సెక్యూరిటీ జైలు గోడ ఉన్నట్టుండి తనంతట తానే కుప్పకూలిపోయింది. 200 అడుగుల పొడవు, 15 అడుగుల ఎత్తు ఉన్న ఈ గోడ ఎలా కూలిపోయిందన్నది అధికారులకు అర్థం కావడం లేదు. ఈ గోడ మూడడుగుల మందం ఉన్న భారీ గోడ.


ఈ జైలులో 50 మంది కరడుగట్టిన ఖలిస్తానీ తీవ్రవాదులున్నారు. దీంతో అధికారులు హుటాహుటిన 33 మందిని సంగ్రూర్ లోని వేరే జైలుకు తరలించారు. మరో 17 మందిని గురువారం తరలించనున్నారు. ఈ జైల్లో మొత్తం 498 మంది ఖైదీలున్నారు. ఇప్పుడు దశలవారీగా వారిని కూడా తరలించడం జరుగుతోంది.


అయితే ఇందులో కుట్ర కోణం ఉండకపోవచ్చునని అధికారులు అంటున్నారు. ఈ గోడ 90 ఏళ్ల నాటిది కావడంతో పాతబడి, దానంతట అదే కూలి ఉండొచ్చని వారంటున్నారు. అలాగైతే ఈ పాటికి ఎర్రకోట, చార్మినార్, కుతుబ్ మీనార్లు కూడా కూలిపోయి ఉండాలి కదా అంటోంది విపక్షం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement