అతిథే ఆవిరి అయితే? | Producer Dil Raju to Present Ravi Babu New movie Aaviri | Sakshi
Sakshi News home page

అతిథే ఆవిరి అయితే?

Published Sun, Sep 29 2019 2:46 AM | Last Updated on Sun, Sep 29 2019 2:46 AM

Producer Dil Raju to Present Ravi Babu New movie Aaviri - Sakshi

‘‘మీ ఇంట్లో మీకు తెలియకుండా ఒక ఆత్మ అతిథిగా మీతో పాటే ఉంటే? ఆ అతిథే ఆవిరైతే ఎలాంటి సంఘటనలు చోటుచేసుకుంటాయి? అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘ఆవిరి’. ‘దిల్‌’ రాజు సమర్పణలో రవిబాబు నటించి, నిర్మించి, దర్శకత్వం వహించారు. నేహా చౌహాన్, శ్రీముక్త, భరణి శంకర్‌ ముఖ్య పాత్రల్లో నటించారు. శనివారం ఈ చిత్రం టీజర్‌ రిలీజ్‌ అయింది. టీజర్‌లోని సన్నివేశాలు ఉత్కంఠభరితంగా ఉన్నాయి. రవిబాబు గత చిత్రాల్లానే భినంగా ఉంటుందని చిత్రబృందం పేర్కొంది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని అక్టోబర్‌లో రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సుధాకర్‌ రెడ్డి, స్క్రీన్‌ప్లే : సత్యానంద్, సంగీతం: వైది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement