అనగనగా... అలా జరిగింది | anagana .. ala jarigindhi audio released | Sakshi
Sakshi News home page

అనగనగా... అలా జరిగింది

Published Tue, Oct 1 2013 1:14 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

అనగనగా... అలా జరిగింది - Sakshi

అనగనగా... అలా జరిగింది

రవిబాబు, సాయిరాజ్, ప్రశాంతి, శ్రావణి ముఖ్య తారలుగా ఎన్.వి.ఎస్. అచ్యుత్, వెంకట్‌రాజ్ గూడూరి, శ్రీరాజ్ బళ్ళ నిర్మించిన చిత్రం ‘అనగనగా’. ‘అలా జరిగింది’ అనేది ఉపశీర్షిక. ఓ కీలక పాత్రను పోషించి,  శ్రీరాజ్ బళ్ళ దర్శకత్వం వహించారు. 
 
 రవివర్మ బళ్ళ స్వరపరచిన ఈ చిత్రం పాటలను వి. సాగర్ ఆవిష్కరించి, యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలందజేశారు. ఈ వేడుకలో పాల్గొన్న కొడాలి వెంకటేశ్వరరావు, వీరశంకర్, వి.ఎన్. ఆదిత్య, సురేష్ కొండేటి, రామసత్యనారాయణ తదితరులు చిత్రం విజయం సాధించాలని ఆకాంక్షించారు. 
 
 అనంతరం దర్శకుడు మాట్లాడుతూ -‘‘కథ, కథనం, పాటలు, ఫొటోగ్రఫీ ఈ సినిమాకు ప్రధాన బలం. రవివర్మ మంచి బాణీలిచ్చారు. ఇది  సస్పెన్స్, థ్రిల్లర్ మూవీ. నిర్మాతలు పూర్తిగా సహకరించడంవల్లే సినిమాను అనుకున్నట్లు తీయగలిగాను’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement