Prasanti
-
‘పశ్చిమ’ కలెక్టర్ ప్రశాంతికి పురస్కారం
భీమవరం(పశ్చిమగోదావరి జిల్లా): జిల్లా కలెక్టర్ ప్రశాంతికి రాష్ట్రస్థాయి అవార్డు లభించింది. విజయవాడలోని తుమ్మలపల్లి కళాకేంద్రంలో బుధవారం జరిగిన 13వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ చేతులమీదుగా కలెక్టర్ పి.ప్రశాంతి రాష్ట్రస్థాయి బెస్ట్ ఎలక్ట్రోలర్ ప్రాక్టీస్ అవార్డును అందుకున్నారు. ఓటరు చైతన్య కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేయడం, అత్యధిక ఓటర్ల నమోదు, చనిపోయిన వారి ఓట్ల తొలగింపునకు సంబంధించి రాష్ట్రంలో ముగ్గురు కలెక్టర్లకు అవార్డులు ప్రకటించగా వారిలో ప్రశాంతి ఒకరు. అవార్డు అందుకున్న కలెక్టర్ ప్రశాంతికి జిల్లా ఉద్యోగులు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. -
నా పాత్రకు మంచి మార్కులే పడ్డాయి!
యాంకర్లు కథానాయికలుగా మారుతున్న సీజన్ ఇది. సుమ, ఉదయభాను ‘హీరోయిన్లు’ అనిపించుకున్నవారే. వీరిద్దరితో పాటు ఈ మధ్య కొందరు యాంకర్లు కూడా కథానాయికలుగా మారారు. ఇప్పుడు ఆ వరుసలో చేరారు ప్రశాంతి. ఆమె కథానాయికగా నటించిన సినిమా ‘అనగనగా’. శ్రీరాజ్ బల్లా స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన ఈ చిత్రంలో రవిబాబు ప్రత్యేక పాత్ర పోషించారు. ఎన్వీయస్ అచ్యుత్, వెంకట్రాజ్ గూడూరి కలిసి నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో ప్రశాంతి మాట్లాడుతూ- ‘‘కథానాయికగా నేను నటించిన తొలి సినిమా ఇంత విజయం సాధించినందుకు ఆనందంగా ఉంది. నా పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. శ్రీరాజ్కి డెరైక్షన్ కొత్త అయినప్పటికీ తెలివిగా తెరకెక్కించాడు. రవిబాబు లాంటి సీనియర్తో కలిసి నటించడం గొప్ప అనుభూతి. హీరోయిన్గా కొనసాగినా, యాంకరింగ్ మాత్రం వదలను’’ అన్నారు. -
అనగనగా... అలా జరిగింది
రవిబాబు, సాయిరాజ్, ప్రశాంతి, శ్రావణి ముఖ్య తారలుగా ఎన్.వి.ఎస్. అచ్యుత్, వెంకట్రాజ్ గూడూరి, శ్రీరాజ్ బళ్ళ నిర్మించిన చిత్రం ‘అనగనగా’. ‘అలా జరిగింది’ అనేది ఉపశీర్షిక. ఓ కీలక పాత్రను పోషించి, శ్రీరాజ్ బళ్ళ దర్శకత్వం వహించారు. రవివర్మ బళ్ళ స్వరపరచిన ఈ చిత్రం పాటలను వి. సాగర్ ఆవిష్కరించి, యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలందజేశారు. ఈ వేడుకలో పాల్గొన్న కొడాలి వెంకటేశ్వరరావు, వీరశంకర్, వి.ఎన్. ఆదిత్య, సురేష్ కొండేటి, రామసత్యనారాయణ తదితరులు చిత్రం విజయం సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం దర్శకుడు మాట్లాడుతూ -‘‘కథ, కథనం, పాటలు, ఫొటోగ్రఫీ ఈ సినిమాకు ప్రధాన బలం. రవివర్మ మంచి బాణీలిచ్చారు. ఇది సస్పెన్స్, థ్రిల్లర్ మూవీ. నిర్మాతలు పూర్తిగా సహకరించడంవల్లే సినిమాను అనుకున్నట్లు తీయగలిగాను’’ అన్నారు.