నా పాత్రకు మంచి మార్కులే పడ్డాయి! | Prasanti says about her good role in Anaganaga telugu movie | Sakshi

నా పాత్రకు మంచి మార్కులే పడ్డాయి!

Nov 25 2013 12:21 AM | Updated on Sep 2 2017 12:57 AM

నా పాత్రకు మంచి మార్కులే పడ్డాయి!

నా పాత్రకు మంచి మార్కులే పడ్డాయి!

యాంకర్లు కథానాయికలుగా మారుతున్న సీజన్ ఇది. సుమ, ఉదయభాను ‘హీరోయిన్లు’ అనిపించుకున్నవారే. వీరిద్దరితో పాటు ఈ మధ్య కొందరు యాంకర్లు కూడా కథానాయికలుగా మారారు.

 యాంకర్లు కథానాయికలుగా మారుతున్న సీజన్ ఇది. సుమ, ఉదయభాను ‘హీరోయిన్లు’ అనిపించుకున్నవారే. వీరిద్దరితో పాటు ఈ మధ్య కొందరు యాంకర్లు కూడా కథానాయికలుగా మారారు. ఇప్పుడు ఆ వరుసలో చేరారు ప్రశాంతి. ఆమె కథానాయికగా నటించిన సినిమా ‘అనగనగా’. శ్రీరాజ్ బల్లా స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన ఈ చిత్రంలో రవిబాబు ప్రత్యేక పాత్ర పోషించారు. ఎన్వీయస్ అచ్యుత్, వెంకట్‌రాజ్ గూడూరి కలిసి నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది.
 
  ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో ప్రశాంతి మాట్లాడుతూ- ‘‘కథానాయికగా నేను నటించిన తొలి సినిమా ఇంత విజయం సాధించినందుకు ఆనందంగా ఉంది. నా పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. శ్రీరాజ్‌కి డెరైక్షన్ కొత్త అయినప్పటికీ తెలివిగా తెరకెక్కించాడు. రవిబాబు లాంటి సీనియర్‌తో కలిసి నటించడం గొప్ప అనుభూతి. హీరోయిన్‌గా కొనసాగినా, యాంకరింగ్ మాత్రం వదలను’’ అన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement