
ఈ మధ్య మన హీరోలు టాలీవుడ్‌లో వస్తున్న మంచి చిత్రాలను ప్రోత్సహిస్తున్నారు. మంచి సినిమాలు వచ్చిన సమయంలో.. పెద్ద హీరోలు వాటిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంటారు. టీజర్, ట్రైలర్స్ విడుదలైన సమయంలో.. వారికి నచ్చితే వాటిని ప్రశంసలతో ముచ్చెత్తుతున్నారు. తాజాగా ఆవిరి సినిమాపై సూపర్‌స్టార్ మహేష్ బాబు కామెంట్ చేశారు.
రవిబాబు తనదైన శైలిలో మరో హారర్ మూవీతో ప్రేక్షకులను భయపెట్టేందుకు వస్తున్నాడు. సినిమా టైటిల్స్‌తోనే ఆసక్తిని రేకెత్తించే రవిబాబు.. ఈసారి ఆవిరి అనే చిత్రంతో మనముందుకు రానున్నాడు. ఈ మూవీ టీజర్‌ను చూసిన మహేష్ బాబు తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. అన్ని సినిమాల్లోకెల్లా హారర్ జానర్‌లో వచ్చే వి ఆసక్తికరంగానే ఉంటాయి. అలాంటి చిత్రాలను తెరకెక్కించడంలో రవిబాబు మాష్టర్.. అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ‘ఆవిరి’చిత్ర బృందాన్ని, దర్శకుడు రవిని ఆల్ ది బెస్ట్ అంటూ మహేష్ విష్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment