‘సూపర్‌ మచ్చి’ అంటున్న చిరు అల్లుడు  | Kalyan Dev And Aadhi Pinisetty Movie First Look Released | Sakshi
Sakshi News home page

‘సూపర్‌ మచ్చి’ అంటున్న చిరు అల్లుడు 

Published Sat, Oct 26 2019 1:00 PM | Last Updated on Sat, Oct 26 2019 1:44 PM

Kalyan Dev And Aadhi Pinisetty Movie First Look Released - Sakshi

సినీ అభిమానులకు దీపావళి పండుగు ఒక రోజు ముందే వచ్చేసింది. దీపావళి కానుకగా పలు చిత్రాలు, క్యారెక్టర్లకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌లను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే మహేశ్‌ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో విజయశాంతికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేసి దీపావళి పండుగ వేడుకలను ప్రారంభించారు. టెన్‌ థౌసెండ్‌ వాలా పేల్చితే కుర్రకారు ఏ రేంజ్‌లో ఎగ్జైట్‌మెంట్‌కు గురవుతారో.. శనివారం ‘సరిలేరు నీకెవ్వరు’లో భారతిగా కనిపించనున్న విజయశాంతి ఫస్ట్‌లుక్‌ చూసి అంతకుమించి ఆనందంలో అభిమానులు ఉన్నారు. 

ఇక విజేత ఫలితం తర్వాత మెగా అల్లుడు కళ్యాణ్‌ దేవ్ చాలా లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్నాడు. పులి వాసు దర్శకత్వంలో ఓ ఇంట్రస్టెంగ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.  అయితే ఈ చిత్రానికి అల్లు అర్జున్‌ సూపర్‌ హిట్‌ సాంగ్‌ ‘సూపర్‌ మచ్చి’నే టైటిల్‌గా ఫిక్స్‌ చేశారు. దీపావళి కానుకగా టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌తో పాటు, మూవీ ఫస్ట్‌ లుక్‌ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. జోరు వానలో చిరునవ్వులు చిందిస్తూ నయా లుక్‌లో మెగా అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. ఇక ఈ సినిమాను రిజ్వాన్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై రిజ్వాన్‌ నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతమందిస్తున్న ఈ చిత్రంలో ‘తూనీగ తూనీగ’ఫేమ్‌ రియా చక్రవర్తి హీరోయిన్‌గా నటిస్తోంది.  
 

ఆది పినిశెట్టి కథానాయకుడిగా కొత్త డైరెక్టర్‌ పృథ్వి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘క్లాప్‌’. స్పోర్ట్స్ జోన‌ర్ చిత్రంలో ఆది పినిశెట్టి న‌టించ‌డం ఇదే తొలిసారి. ఈ చిత్రం అథ్లెటిక్స్‌కు సంబంధించిన కథ కాగా, ఇందులో ఆది అథ్లెట్‌గా మారే క్ర‌మంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడో చూపించ‌నున్నారు. తెలుగు, త‌మిళ భాష‌ల‌లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. తాజాగా దీపావళి కానుకగా చిత్ర ఫస్ట్‌ లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ సినిమాను బిగ్ ప్రింట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఐబీ కార్తికేయ‌న్  నిర్మిస్తున్నాడు. ఆకాంక్ష సింగ్ క‌థానాయికగా న‌టిస్తున్న ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతమందిస్తున్నాడు. 

నో కట్‌.. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌
రవిబాబు, నేహా చౌహాన్, శ్రీముక్త, భరణీ శంకర్, ముక్తార్‌ ఖాన్‌ ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘ఆవిరి’. నిర్మాత ‘దిల్‌’రాజు సమర్పణలో ఎ ఫ్లయింగ్‌ ఫ్రాగ్స్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై రవిబాబు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం తాజాగా సెన్సార్‌ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్‌ సభ్యులు ఎలాంటి కట్‌లు చెప్పకుండా యూ/ఏ సర్టిఫికేట్‌ ఇచ్చినట్లు చిత్ర బృందం ప్రకటించింది. అంతేకాకుండా దీపావళి కానుకగా చిత్ర రిలీజ్‌ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది. నవంబర్‌ 1న థియోటర్‌లో కలుద్దామంటూ చిత్రబృందం ట్వీట్‌ చేసింది. ఇక ఈ చిత్ర టైటిల్‌, టీజర్‌ను సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు మెచ్చుకోవడంతో ‘ఆవిరి’ భారీ అంచనాలే ఏర్పడ్డాయి. 

నవంబర్‌ 29న ‘అర్జున్‌ సురవరం’
కిరాక్‌ పార్టీ సినిమా తరువాత లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్న నిఖిల్‌.. కోలీవుడ్‌లో సూపర్‌ హిట్ సాధించిన ‘కనితన్‌’ సినిమాను ‘అర్జున్‌ సురవరం’ గా రిమేక్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. టీఎన్‌ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఠాగూర్‌ మధు, కావ్య వేణుగోపాల్‌లు నిర్మిస్తున్నారు. నిఖిల్ జోడిగా లావణ్య త్రిపాఠి నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ముందుగా టైటిల్ వివాదంతో ఇబ్బంది పడ్డ ఈ మూవీ తరువాత రిలీజ్ విషయంలోనూ తడబడుతోంది. అయితే తాజాగా మూవీ రిలీజ్‌ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. నవంబర్‌ 29న ప్రేక్షకుల ముందుకు ‘అర్జున్‌ సురవరం’రాబోతున్నట్లు చిత్ర బృందం తెలిపింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement