
ఒకప్పడు గ్రామాల్లో మాతంగులుగా జీవించిన వారిలో ఒక స్త్రీ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘భయం.. కేరాఫ్ దెయ్యం’. మాతంగిగా రమ్య, మాంత్రికుడిగా నటుడు–దర్శకుడు రవిబాబు, తాంత్రికుడిగా నటుడు సత్యప్రకాష్ ముఖ్యపాత్రలు చేశారు. సీవీఎస్‌ఎం వెంకట రవీందర్ నాథ్ దర్శకత్వంలో పెదారికట్ల చేనెబోయిన్న నరసమ్మ, వెంకటేశ్వర్లు నిర్మించారు. ‘‘హారర్, థ్రిల్లర్ అంశాలు జోడించి ఈ చిత్రాన్ని రూపొందించాం. ఇటీవల జరిపిన రెండో షెడ్యూల్‌లో రవిబాబుపై సీన్స్ తీశాం. కన్నడ, తెలుగు భాషల్లో నిర్మించిన ఈ చిత్రం విడుదల తేదీని త్వరలో తెలియజేస్తాం’’ అని దర్శక–నిర్మాతలు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment