హారర్‌.. థ్రిల్లర్‌ | Ravi Babu horror thriller movie updates | Sakshi
Sakshi News home page

హారర్‌.. థ్రిల్లర్‌

Published Mon, Jun 12 2023 6:39 AM | Last Updated on Mon, Jun 12 2023 6:39 AM

Ravi Babu horror thriller movie updates - Sakshi

రవిబాబు, సత్యప్రకాష్, ‘చిత్రం’ శ్రీను కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘టెర్రర్‌ ద వే ఆఫ్‌ డెవిల్‌’. ఈ చిత్రం ద్వారా సీవీఎస్‌ఎమ్‌ వెంకట్‌ రవీంద్రనాథ్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శ్రీ కృష్ణార్జున మూవీ మేకర్స్‌పై పెదారికట్ల చెన్నెబోయిన నరసమ్మ, వెంకటేశ్వర్లు యాదవ్‌ నిర్మిస్తున్నారు.

ఈ సినిమా తొలి షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో పెదారికట్ల చెన్నెబోయిన నరసమ్మ, వెంకటేశ్వర్లు యాదవ్‌ మాట్లాడుతూ–‘‘గతంలో గ్రామాల్లో మాతంగులు జీవించేవారు. వారి జీవితాల ఆధారంగా అల్లుకున్న కథకి హారర్, థ్రిల్లర్‌ అంశాలు జోడించి ఈ చిత్రం నిర్మిస్తున్నాం. ఈ మూవీ ద్వారా ముగ్గురు కొత్త అమ్మాయిలను హీరోయి¯Œ ్సగా పరిచయం చేస్తున్నాం. తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్న ఈ సినిమా రెండవ షెడ్యూల్‌ నేటి నుంచి ప్రారంభం
అవుతుంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: పీకే స్టిల్‌ రాజ్‌ కమల్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement