Stand Up Rahul Press Meet Hyderabad: Raj Tarun And Varsha Bollamma Comments About Movie - Sakshi

Stand Up Rahul Movie: నా జీవితం ఆధారంగా తెరకెక్కించాను: డైరెక్టర్‌

Mar 16 2022 10:14 AM | Updated on Mar 16 2022 10:37 AM

Raj Tarun Starrer Stand Up Rahul Movie Press Meet In Hyderabad - Sakshi

Raj Tarun Starrer Stand Up Rahul Movie Press Meet In Hyderabad: 'ఉయ్యాల జంపాల' చిత్రంతో హీరోగా పరిచయమై మొదటి సినిమాతోనే మంచి క్రేజ్​ తెచ్చుకున్నాడు రాజ్​ తరుణ్​. ప్రస్తుతం 'స్టాండప్ రాహుల్‌' సినిమాలో నటిస్తున్నాడు. శాంటో మోహన్‌ వీరంకి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ హీరోయిన్‌గా నటిస్తోంది. నందకుమార్‌ అబ్బినేని, భరత్‌ మాగులూరి సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీకి 'కూర్చుంది చాలు' అనేది క్యాప్షన్‌. ఈ సినిమా మార్చి 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించింది చిత్రబృందం. 'మా రెండేళ్ల ప్రయాణం ఈ చిత్రం. ఇందులో చక్కటి వినోదంతోపాటు మంచి ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. నాకు రోల్‌కు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. వాటిని బ్యాలెన్స్‌ చేస్తూ, నా కుటుంబాన్ని చూసుకుంటూ స్టాండప్‌ కామెడీ ఎలా చేశాననేదే ఈ సినిమా కథ.' అని హీరో రాజ్‌ తరుణ్‌ తెలిపాడు. 

అలాగే దర్శకుడు శాంటో మోహన్‌ వీరంకి మాట్లాడుతూ 'నా జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ కథ రాసుకున్నా. సినిమా వాళ్లకు, బ్యాచిలర్స్‌కు హైదరాబాద్‌లో ఇల్లు దొరకడం చాలా కష్టం. ఇవి మూవీలో హీరో పాత్రతో చెప్పించాను. ఈ చిత్రానికి సంగీతం, సాహిత్యం చక్కగా కుదిరాయి.' అని అన్నారు. స్టాండప్‌ రాహుల్ చిత్రం తనకే కాదు, తన టీమ్‌ మొత్తానికి మంచి గుర్తింపు తెస్తుందని హీరోయిన్‌ వర్ష బొల్లమ్మ చెప్పుకొచ్చింది. థియేటర్లలో సినిమా చూసి ఆడియెన్స్‌ నవ్వులతో బయటకొస్తారని నమ్మకముందని పేర్కొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement