
వంశీ ఏకసిరి
వంశీ ఏకసిరి, స్టెఫీ పాటిల్ జంటగా నటించిన చిత్రం ‘నిన్ను తలచి’. అనిల్ తోట దర్శకత్వంలో ఎమ్. ఓబులేస్, ఎన్. అజిత్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది. వంశీ మాట్లాడుతూ– ‘‘మాది నెల్లూరు. ఇంజనీరింగ్ తర్వాత ఏమ్‌బీఏ పూర్తి చేశాను. నటనపై ఆసక్తితో 2013లో ఇండస్ట్రీలోకి వచ్చాను. అప్పటినుంచే అనిల్‌గారు పరిచయం. కొన్ని చిత్రాల్లో సహాయ పాత్రలు చేశాను.
అనిల్‌గారు, నేను కలిసి ఓ డెమో వీడియో చేశాం. అది చూసిన నిర్మాతలు ఈ సినిమా చాన్స్ ఇచ్చారు. ఈ చిత్రంలో అభి అనే పాత్రలో నటించాను. అంకిత పాత్రలో స్టెఫీ నటించారు. అభి, అంకితల జర్నీయే ఈ సినిమా. ప్రతి లవర్‌కి కనెక్ట్ అయ్యే చిత్రమిది. లవ్‌స్టోరీలో ఉన్న ఊహించని మలుపులు ఆడియన్స్‌ను థ్రిల్‌కు గురి చేస్తాయి. మంచి ఎమోషనల్ డ్రామా ఉంటుంది. నా నెక్ట్స్ చిత్రం కూడా అనిల్ దర్శకత్వంలోనే ఉంటుంది’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment