Poonam Kaur Gets Emotional In Nathi Charami Movie Press Meet: 'మాయాజాలం' సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టింది పూనమ్ కౌర్. తర్వాత పలు సినిమాల్లో సెకండ్ హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయింది. సరైన అవకాశాలు లేక నాలుగేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటోంది. అయితే చాలా గ్యాప్ తర్వాత పూనమ్ ఒక సినిమాలో నటిస్తోంది. ఆ సినిమానే అరవింద్ కృష్ణ, సందేష్ బురి ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'నాతి చరామి'. నాగు గవర దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని ఏ స్టూడియే 24 ఫ్రేమ్స్ ప్రొడక్షన్స్ పతాకంపై జై వైష్ణవి కె నిర్మిస్తున్నారు. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం రికార్డు స్థాయిలో అమెజాన్, హంగామా, సోనీ, టాటా స్కై, ఎయిర్‌టెల్ ఎక్స్ట్రీమ్, ఎంఎక్స్ ప్లేయర్ వంటి 20 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో మార్చి 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం (మార్చి 8) హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ ప్రెస్ మీట్‌లో పూనమ్ కౌర్ భావోద్వేగానికి గురైంది. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు రావడంతో తాను కన్నీళ్లు ఆపుకోలేక పోయానని తెలిపింది. తాను సినిమాలు వదిలేసి వెళ్లిపోవాలనుకున్నట్లు పేర్కొంది. '2017, 18లో నేను పెళ్లి చేసుకుని యూఎస్ వెళ్లిపోదామనుకున్నా. కానీ నా జీవితాన్ని మార్చేసింది సినిమానే. తర్వాత ఇక సినిమాలు చేయను. పెళ్లి చేసుకుని యూఎస్ వెళ్లిపోతానని మమ్మీకి చెప్పాను. దేశం వదిలి వెళ్లిపోతానని చెప్పా. కానీ చాలా క్లిష్టతరమైన పరిస్థితిలో రియలైజ్ అయ్యాను. దానివల్లే ఇక్కడ ఉన్నాను. ప్రతిరోజూ సీత, దుర్గా, ద్రౌపదిలానే తలచుకునేదాన్ని. అందువల్లే చాలా శక్తిని, ధైర్యాన్ని పొందాను. మధ్య తరగతి అమ్మాయిలకు చాలా కలలుంటాయి. అందులో ప్రత్యేకమైనది పెళ్లి. ఆ పెళ్లి కలను కొందరు చెదరగొట్టారు. అయితే ఇండియన్ కల్చర్‌లోనే మహిళలు ఎలా ధైర్యంగా ఉండాలనేది, పోరాడలనేది ఉంది. దాన్నుంచే నేను స్ఫూర్తి పొందాను. ఈ విషయంలో అమ్మ ఎంతో సపోర్ట్ చేసింది.' అని తెలిపింది పూనమ్.
(మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ఈ క్రమంలోనే ఉమెన్ సెంట్రిక్ మూవీ ఒకటి ఉందని నా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పిందని పూనమ్ కౌర్ పేర్కొంది. ఇది నిజజీవిత సంఘటనల ఆధారంగా, భార్య గురించి చెప్పే కథ అని తెలిసాక ఒప్పుకున్నట్లు వెల్లడించింది. 'నాతి చరామిలోని శ్రీలత పాత్ర నా జీవితానికి చాలా దగ్గరగా ఉంది. మూడేళ్ల క్రితం నా ఆలోచనలు 18 ఏళ్ల అమ్మాయిలా ఉన్నాయి. ఇప్పుడు 50 ఏళ్ల మహిళగా ఉన్నాయి.' అని పూనమ్ కౌర్ వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment