టాలీవుడ్ కి కొత్త హీరోయిన్ ఎంట్రీ! | Nabha Natesh to make Telugu debut with Ravi Babu next film | Sakshi
Sakshi News home page

టాలీవుడ్ కి కొత్త హీరోయిన్ ఎంట్రీ!

Published Tue, Mar 22 2016 8:31 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

టాలీవుడ్ కి కొత్త హీరోయిన్ ఎంట్రీ! - Sakshi

టాలీవుడ్ కి కొత్త హీరోయిన్ ఎంట్రీ!

కన్నడ నటి 'వజ్రకాయ' ఫేమ్ నభా నతేష్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. గతేడాది విడుదలైన కన్నడ మూవీలో సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ తో జతకట్టి అక్కడ ఎంట్రీతోనే మంచి మార్కులు కొట్టేసిన విషయం తెలిసిందే. ఆమె టాలీవుడ్ కు పరిచయం కాబోతున్నట్లు ఇటీవల వార్తలు కూడా వచ్చాయి. రవిబాబు దర్శకత్వంలో త్వరలో తెరకెక్కనున్న మూవీలో నతేష్ అరంగేట్రం చేయనుంది. ఈ మూవీతోనే హీరో అభిషేక్ కూడా తెలుగు అభిమానులకు పరిచయం కానున్నాడు.

ఈ మూవీకి ఇప్పటివరకైతే ఎలాంటి టైటిల్ ఫిక్సవ్వలేదుని తెలుస్తోంది. అయితే కన్నడలో ఆమె తొలి మూవీకి రవిబాబు తీయబోయే సినిమాలో హీరోయిన్ పాత్రకు ఎక్కడ పోలికే ఉండదని వార్తలొస్తున్నాయి. ఈ నెల చివర్లో గానీ, ఏప్రిల్ మొదటి వారంలోగానీ షూటింగ్ ప్రారంభమవుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. కొత్త నటులను తెరకు పరిచయం చేసే సురేష్ ప్రొడక్షన్ వారు ఈ మూవీ తీస్తున్నారు. విభిన్నకథతో రవిబాబు ఈ మూవీని తెరకెక్కించనున్నాడని టాలీవుడ్ వర్గాల టాక్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement