తొలిప్రేమ పవిత్రత
తొలిప్రేమ పవిత్రత
Published Tue, Aug 20 2013 12:51 AM | Last Updated on Fri, Sep 1 2017 9:55 PM
నిజాయితీ గల ఓ పోలీస్ అధికారి, ఓ దొంగ, ఓ సాధారణమైన అమ్మాయి... ఈ ముగ్గురి నేపథ్యంలో సాగే కథాంశంతో ఓ చిత్రం రూపొందుతోంది. రవిబాబు, క్రాంతి, చిత్రం శ్రీను, దిలీప్, సాయినాథ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి జయారుష్(వన్నీ) దర్శకుడు.
ఆర్.సాయిరాజు నిర్మాత. ఈ చిత్రం ప్రారంభోత్సవం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ముహూర్తపు దృశ్యానికి శివబాలాజీ కెమెరా స్విచాన్ చేయగా, డా.శ్రీహరి క్లాప్ ఇచ్చారు. తొలిప్రేమలో ఎంతటి పవిత్రత ఉంటుందో ఈ సినిమాలో చూపిస్తున్నామని దర్శకుడు చెప్పారు.
వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్‌కి వెళతామని, హైదరాబాద్, రాజమండ్రి, విశాఖల్లో చిత్రీకరణ జరుపుతామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: ప్రసన్నకుమార్, కెమెరా: దాము నర్రావుల, సంగీతం: దిలీప్, కళ: పి.కిరణ్‌కుమార్, కూర్పు: ప్రవీణ్ పూడి.
Advertisement
Advertisement