మహేష్ సినిమా నిర్మాతలెవరంటే..! | Vamshi paidipally Reveals Mahesh Film Producers | Sakshi
Sakshi News home page

మహేష్ సినిమా నిర్మాతలెవరంటే..!

Dec 18 2016 10:49 AM | Updated on Sep 4 2017 11:03 PM

మహేష్ సినిమా నిర్మాతలెవరంటే..!

మహేష్ సినిమా నిర్మాతలెవరంటే..!

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ప్రముఖ నిర్మాణ సంస్థ పీవీపీ సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఓ సినిమాను ఎనౌన్స్ చేసింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ప్రముఖ నిర్మాణ సంస్థ పీవీపీ సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఓ సినిమాను ఎనౌన్స్ చేసింది. అయితే పీవీపీ ఎనౌన్స్ చేసినా.. ఈ ప్రాజెక్ట్పై మహేష్ వర్గం నుంచి మాత్రం ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. ఆ సమయంలో మహేష్ అనుమతి తీసుకోకుండానే పీవీపీ సంస్థ ఈ ప్రాజెక్ట్ను ప్రకటించిందన్న టాక్ కూడా వినిపించింది. అందుకే మహేష్ వంశీ పైడిపల్లి సినిమాను పక్కన పెట్టేశాడన్న ప్రచారం జరిగింది.

అయితే తాజాగా మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాపై క్లారిటీ వచ్చింది. దర్శకుడు వంశీ పైడిపల్లి, మహేష్ బాబు 25వ సినిమాను తాను డైరెక్టర్ చేయబోతున్నట్టుగా ప్రకటించాడు. అంతేకాదు ఈ సినిమాను అశ్వనీదత్, దిల్ రాజులు సంయుక్తంగా నిర్మిస్తారని తెలిపాడు. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్లో నటిస్తున్న మహేష్, ఆ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత వంశీపైడిపల్లి డైరెక్ట్ చేసే సినిమా సెట్స్ మీదకు వెళుతుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement