LEAKED: Mahesh Babu - Vamsi Paidipally Movie Photos Leaked | #MB25 Movie Leaked Photos - Sakshi
Sakshi News home page

Published Thu, Jun 21 2018 9:08 AM | Last Updated on Thu, Aug 22 2019 9:35 AM

Mahesh Babu Latest movie stills leaked - Sakshi

డెహ్రాడూన్‌ : ఇటీవల  టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబును ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌ కలిసిన ఫొటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసిన సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా సినిమా షూటింగ్‌ ఇటీవల డెహ్రాడూన్‌లో సాగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రావత్‌ ప్రత్యేకంగా షూటింగ్‌ సెట్‌ను సందర్శించి.. చిత్రయూనిట్‌తో ముచ్చటించారు. మహేశ్‌బాబు, పూజా హెగ్డే, దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్‌ రాజు ఈ సందర్భంగా సీఎంను శాలువాతో సన్మానించారు. ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుండగా.. ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన మరిన్ని ఫొటోలు లీక్‌ అయ్యాయి.

ఈ సినిమాలో మహేశ్‌ స్టూడెంట్‌గా యాక్ట్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కాలేజీ సీన్లకు సంబంధించిన ఫొటోలు తాజాగా సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. కాలేజీ సీన్లలో స్టూడెంట్‌గా డిఫరెంట్‌ లుక్‌తో మహేశ్‌ ఆకట్టుకునేలా ఉన్నాడని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.



No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement