
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంపై సినీ నిర్మాత చలసాని అశ్వనీదత్ చౌదరి చేసిన వ్యాఖ్యలను అమరావతి కాపునాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యర్రంశెట్టి అంజిబాబు గురువారం ఖండించారు. ముద్రగడపై ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకుంటే సహించేది లేదని హెచ్చరించారు.
అశ్వనీదత్ ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ముద్రగడను వాడు, వీడు అంటూ సంబోధించడాన్ని తప్పుబట్టారు. కుల అహంకారంతో ముద్రగడను దూషించిన అశ్వనీదత్‌కు కాపుల నుంచి ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. కాపులది పిచ్చి ఉద్యమమని వ్యాఖ్యానించి.. కాపు జాతిని అవమానించారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment