Anjibabu
-
'ఆయ్'... మన కోనసీమేనండి!
మనం ఎంచుకున్న లక్ష్యానికి నిబద్ధత, శ్రమ, తపన తోడైతే దాని ఫలితం అద్భుతంగా ఉంటుందనే నమ్మకాన్ని ‘ఆయ్’ సినిమా దర్శకుడు అంజిబాబు కంచిపల్లి రుజువు చేశాడు. తొలి ప్రయత్నంలోనే సినీ దర్శకుడిగా విజయాన్ని సొంతం చేసుకున్నాడు... డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం పట్టణ శివారు కొంకాపల్లి అంజిబాబు స్వస్థలం. పదో తరగతి చదువుతున్న రోజుల్లో ఒకరోజు...‘నేను సినిమా డైరెక్టర్ కావాలనుకుంటున్నాను’ అని తండ్రి బూరయ్య, సోదరులకు చెప్పాడు. ఆ వయసులో పిల్లల నోటి నుంచి వినిపించే కలలకు పెద్దలు ‘అలాగే’ అంటారు తప్ప అంత సీరియస్‌గా తీసుకోరు. కానీ అంజిబాబు మాత్రం యమ సీరియస్‌గా తీసుకున్నాడు. ‘ముందు నువ్వు డిగ్రీ పూర్తి చేయి. తర్వాత ఆలోచిద్దాం’ అని తండ్రి చెప్పాడు. తన లక్ష్యాన్ని సీరియస్‌గా తీసుకున్నప్పటికీ చదువును మాత్రం అశ్రద్ధ చేయలేదు. అమలాపురంలో డిగ్రీ పూర్తి చేసిన తరువాత ఓ మంచి రోజు తన కలల దారిని వెదుక్కుంటూ హైదరాబాద్ బస్సెక్కేశాడు. ఎంతోమంది దర్శకుల దగ్గర అసిస్టెంట్‌గా పని చేశాడు.కోనసీమలో బాల్యం నుంచి స్నేహంగా చిగురించిన బంధాలు, అనుబంధాలు పెద్దయ్యాక కులాల కుంపటి రాజుకుని నాశనమవుతున్నాయి. కులాల బీటలతో స్నేహం, ప్రేమ విచ్ఛిన్నం అవుతున్నాయి. ఇదే తన కథలో ప్రధానాంశంగా ఎంచుకుని సినిమా కోసం ఓ స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నాడు.తాను రాసుకున్న కథను గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్, భాగస్వామి బన్నీ వాసులకు వినిపించాడు. గీతా ఆర్ట్స్‌కు నచ్చడంతో అంజిబాబు కథా రచయితగా తొలి విజయం సాధించాడు. సినిమాని కోనసీమ నదీ పరీవాహక గ్రామాల్లో చిత్రీకరించడం రెండో విజయం. అమలాపురం వేదికగా రూపుదిద్దుకున్న ‘కోనసీమ ఫిలిమ్ అసోసియేషన్’కు చెందిన సినీ ఆర్టిస్ట్‌లతో కొంత మందికి అంజిబాబు ‘ఆయ్’ సినిమాలో నటించే అవకాశాన్ని ఇచ్చి వారి నుంచి మంచి నటనను రాబట్టాడు. తన తండ్రిపై ఉన్న అభిమానంతోనే ‘ఆయ్’ సినిమాలోని హీరో తండ్రి క్యారెక్టర్‌కు ‘బూరయ్య’ అని పేరు పెట్టాడు.చిన్నతనం నుంచి తాను పుట్టి పెరిగిన కోనసీమలోని ప్రకృతి అందాలు, గ్రామీణ సౌందర్యాలను తాను తీసే తొలి చిత్రంలో తెరకెక్కించాలనే కలను నిజం చేసుకున్నాడు. కోనసీమ యాస, నేటివిటీకి హాస్యాన్ని జోడించి ‘ఆయ్’ చిత్రాన్ని తెరకెక్కించి విజయాన్ని అందుకున్నాడు అంజిబాబు. – పరసా సుబ్బారావు, సాక్షి, అమలాపురం టౌన్"తొలి ప్రయత్నంలోనే సినీ దర్శకుడు కావాలన్న నా శ్రమ, కల ఇప్పుడు ’ఆయ్’ చిత్ర రూపంలో ఫలించినందుకు సంతోషంగా ఉంది. సమాజానికి ఓ మంచి సందేశం ఇవ్వాలన్న నా కోరిక కూడా ‘ఆయ్’ చిత్రం ద్వారా తీరింది. కోనసీమ అందాలు, అచ్చమైన పల్లె వాతావరణం, గోదారోళ్ల యాస మాటలు, సందర్భోచిత హాస్యంతో సినిమాను తీయాలనే ఆలోచనతో ‘ఆయ్’ చిత్రం కథను రాశాను. నా క«థను మెచ్చి చిత్రాన్ని తెరకెక్కించేలా చేసిన గీతా ఆర్ట్స్‌కు, అల్లు అరవింద్, బన్నీ వాసులకు నా ధన్యవాదాలు." – అంజిబాబు కంచిపల్లి, ఆయ్ చిత్ర దర్శకుడు -
ఆయ్.. మనోడేనండి
అమలాపురం టౌన్: ఆయ్.. ఓయ్.. మాటలు గోదావరి జిల్లాల యాసే. గోదారోళ్ల వెటకారంతో కూడిన మాటలు, యాసలు ఇటీవల కాలంలో యూట్యూబ్, సోషల్ మీడియాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అవే సినిమాల్లోనూ సక్సెస్ అవుతున్నాయి. ఈ కోవలోంచే రెండు రోజుల కిందట విడుదలైన ‘ఆయ్’ సినిమా పుట్టుకొచ్చింది. దీనిని గోదారోళ్ల యాసను రంగరించి చిత్రీకరించారు. అమలాపురం కుర్రాడైన యువ దర్శకుడు అంజిబాబు కంచిపల్లి దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే నూరు శాతం కోనసీమ గ్రామీణంలో సినిమా తీసి విజయవంతం అయ్యారు. ఇటీవల విడుదలైన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, కమిటీ కుర్రాళ్లు చిత్రాలు కూడా దాదాపు కోనసీమ అందాల నడుమే రూపుదిద్దుకున్నాయి. ఈ చిత్రాల్లో కోనసీమ ఫిలిం అసోసియేషన్‌కు చెందిన వర్థమాన నటీనటులు 50 మందికి పైగా ఆయా చిత్రాల దర్శకులు అవకాశాలు ఇచ్చారంటే ఈ పచ్చని సీమకు సినిమా సిరి పెరుగుతోందని తెలుస్తోంది. ఆయ్ చిత్రంలో కోనసీమ ఫిలిం అసోసియేషన్‌కు చెందిన 12 మంది నటీనటులకు ఛాన్స్ దొరికింది. అంజిబాబు ప్రస్థానం ఇది అమలాపురం కొంకాపల్లికి చెందిన వర్ధమాన సినీ దర్శకుడు అంజిబాబు కంచిపల్లి ఎస్కేబీఆర్ కాలేజీలో చదివారు. ఆయనది వ్యవసాయ కుటుంబం. చిన్నతనం నుంచీ ఆయన సినీ పరిశ్రమపై మక్కువ పెంచుకున్నారు. 12 ఏళ్ల కిందటే మంచి సందేశాత్మక చిత్రాలు తియ్యాలన్న ఆకాంక్షతో సినీ పరిశ్రమలోని దర్శక విభాగంలో శిక్షణ పొందారు. అసోసియేట్, కోఅసిస్టెంట్ డైరెక్టర్‌గా పలువురి దర్శకుల వద్ద పనిచేశారు. నేడు తాను కన్న సినీ కలను నెరవేర్చుకునేలా ఆయ్ చిత్రాన్ని రూపొందించారు. తాను పుట్టి పెరిగిన అమలాపురం పరిసర ప్రాంతాల్లోనే ఆ సినిమాను తీసి కోనసీమ కుర్రాడు అనిపించుకున్నారు. దర్శకుడిగా తొలిసారిగా ఆయ్ చిత్రానికి బాధ్యత వహించి కోనసీమ నేటివిటీని, ఆ సీమతో మిళితమయ్యే కథాంశాన్ని తెరకెక్కించారు. అమలాపురం పట్టణంతోపాటు కోనసీమలోని దాదాపు 22 గ్రామాల్లోని నదీ పాయలు, కొబ్బరి, అరటి తోటలు, వరి చేలు, కాలువ గట్లు, సముద్ర తీరాన్ని తన సినిమాలో బంధించారు. చిన్నతనంలో స్నేహాలుగా చిగురించి పెద్దయ్యాక కులాల కుంపటితో రగలిపోయే నేటి తరాన్ని కులాలు కంటే స్నేహాలు గొప్పవన్న సందేశంతో సినిమాను ఆద్యంతం రక్తికట్టించారు. అందుకే ‘ఆయ్’ మెయిన్ టైటిల్‌తోనూ, ‘మేం ఫ్రెండ్స్ండి’ అనే సబ్ టైటిల్ (ట్యాగ్)తో చిత్రాన్ని రూపొందించారు. మధ్యలో హాస్యం జోడించి పూర్తి ఇంటర్టైన్మెంట్ సినిమాను తన మొదటి బహుమతిగా ప్రేక్షకులకు అందించారు. కమిటీ కుర్రాళ్లు సినిమా ఇక్కడి నేటివిటీతో చిత్రీకరించి హిట్ కొడితే.. ఆయ్ చిత్రం కూడా కోనసీమ యాసను, స్నేహా బంధాలను గుర్తు చేస్తూ సాగింది. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, కమిటీ కుర్రాళ్లు చిత్రాల దర్శకులు కోనసీమేతురులై ఈ రెండు చిత్రాలను ఈ ప్రాంత నేటివిటీతో చిత్రీకరించారు. అయితే ఆయ్ చిత్ర దర్శకుడు అంజిబాబు అమలాపురానికి చెందిన వాడై.. ఈ ప్రాంతానికి అనువైన, అనుబంధమైన కథాంశాన్ని ఎంచుకుని కష్టపడి, ఇష్టపడి తీశారు. ఇక్కడి నుంచే నా తొలి చిత్రం నేను సినీ దర్శకునిగా తొలి చిత్రం ‘ఆయ్’ కోనసీమ నుంచే శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉంది. 12 ఏళ్ల నా కల సాకారమైంది. స్నేహ సంబంధాలు కులాల రాపిడిలో పడి చెక్కు చెదరకూడదన్న సందేశంతో ఈ చిత్రం తీశాను. కేరళకు మించిన ప్రకృతి సహజ సిద్ధ అందాలు కోనసీమలోనే ఉన్నాయి. నా చిన్నతనం నుంచి చూస్తున్న కోనసీమ ప్రకృతి అందాలతో పాటు అచ్చమైన గ్రామీణ సౌందర్యాన్ని చిత్రంతో తెరకెక్కించాను. హాస్యం, సెంట్మెంట్ తదితర అంశాలతో మంచి చిత్రాన్ని తీశానన్న సంతృప్తి మిగిలింది. – అంజిబాబు కంచిపల్లి, ఆయ్ చిత్ర దర్శకుడు, అమలాపురం -
మాకొద్దు టీడీపీ కేడర్!
భీమవరం: బూటకపు హామీలతో ప్రజలను మోసం చేసిన చంద్రబాబును ప్రజలంతా నిన్ను నమ్మంబాబూ అంటుంటే.. భీమవరం జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) మాత్రం టీడీపీ నాయకులను నమ్మే పరిస్థితి లేదని పలువురు అంటున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యరి్థగా పోటీచేసిన అంజిబాబు ఓటర్లకు పంపిణీ కోసం ఇచ్చిన సొమ్మును సైతం తెలుగుదేశం పార్టీ నాయకులు స్వాహా చేయడంతో పోలింగ్ రోజున ఓటర్లు ఆ పార్టీ కార్యాలయానికి వచ్చి గందరగోళం సృష్టించారు. అప్పటి ఎన్నికల్లో అంజిబాబు ఘోరంగా ఓడిపోగా ఆయనకు చంద్రబాబు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకపోవడంతో ఐదేళ్లుగా పార్టీకి దూరంగా ఉంటూ వ్యా పార, వ్యవహారాలు చక్కబెట్టుకున్నారు. దీంతో భీమవరం నియోజకవర్గంలో టీడీపీ చుక్కాని లేని నావలా మారింది.ఇదిలా ఉండగా ప్రస్తుత ఎన్నికల్లో అంజిబాబు జనసేన పార్టీ అభ్యరి ్థగా బరిలో నిలిచారు. పార్టీలు మారడంలో దిట్ట అనే ముద్ర వేసుకున్న అంజిబాబు నుంచి అందిన కాడికి అందిపుచ్చుకోవాలనే ప్రయత్నాలు టీడీపీ శ్రేణులు ప్రారంభించినట్టు ప్రచారం జరుగుతోంది. ఎంతోకొంత ఆయన నుంచి చేజిక్కుంచుకోకపోతే ఇంతకాలం పార్టీ కోసం పనిచేస్తున్నందుకు ప్రయోజనం ఏంటనే నిర్ణయానికి టీడీపీ శ్రేణులు వచ్చినట్టు తెలిసింది. ఇప్పటికే టీడీపీ ముఖ్య నాయకులు అంజిబాబు అభ్యరి్థత్వాన్ని వ్యతిరేకిస్తుండగా ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు సొమ్ముల కోసం జనసేన పార్టీ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారంట.సొంత మనుషులతోనే కార్యాచరణ టీడీపీ, జనసేన నాయకులు ఎన్నికల్లో పెత్తనం చేయడానికి ప్రయత్నించగా గత అనుభవాల దృష్ట్యా అంజిబాబు జాగ్రత్త పడినట్లు చెబుతున్నారు. దీంతో నామినేషన్ కార్యక్రమానికి జనాన్ని తరలించడం దగ్గర నుంచి ఎన్నికల ప్రచార వ్యవహారాలు కూడా తన బంధువులు, కావాల్సిన వారితోనే చేయిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా డబ్బులు విషయంలో అంజిబాబు అతి జాగ్రత్తగా వ్యవహరించడం టీడీపీ, జనసేన కేడర్‌కు మింగుడు పడటంలేదు. ఎన్నికల్లో ఓడిపోతే అంజిబాబు పత్తా ఉండరు కాబట్టి అయినకాడికి దండుకునే ప్రయత్నాలను కేడర్ చేస్తున్నట్టు తెలిసింది. దీంతో సొంత మనుషులతోనే అంజిబాబు ఎన్నికల కా ర్యాచరణ రూపొందించినట్టు సమాచారం. జనసేన శ్రేణుల చిందులు నరసాపురం: పట్టణంలోని దర్గా సెంటర్లో జనసేన ప్రచార కార్యక్రమంలో ఇద్దరు జర్నలిస్టులపై ఆ పార్టీనాయకులు అసభ్య పదజాలంతో దూషణలు దిగడం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. సోమవారం డ్యాన్ మాస్టర్ శేఖర్ దర్గా సెంటర్లో జనసేన తరఫున ప్రచార కార్యక్రమానికి వచ్చారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంలో కవరేజీకి వెళ్లిన ఓ పత్రిక విలేకరి, మరో న్యూస్ చానల్ జర్నలిస్ట్‌పై అక్కడున్న జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్ కెమెరామెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫొటోలకు అడ్డువస్తున్నారు, మీరు ఎవరు? అంటూ రుసరుసలాడాడు.తాము జర్నలిస్టులమని చెప్పబోతుండగా.. జర్నలిస్టులైతే ఐడీ కార్డులు వేసుకుని తిరగాలని గర్జించారు. ‘నేనవరు అనుకుంటున్నావు.. నాయకర్ కెమెరామెన్‌ని, కాబోయే మంత్రి మనిషిని’ అంటూ శివాలెత్తారు. ఇప్పటికే నాయకర్ వ్యవహార తీరుపై నియోజకవర్గంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా నాయకర్ అనుయాయుల దురుసు ప్రవర్తనతో ముందుకు వెళుతున్నారు. జనసేన తీరుపై జర్నలిస్టు సంఘాలు మండిపడుతున్నాయి. -
అశ్వనీదత్.. నోరు అదుపులో పెట్టుకో
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంపై సినీ నిర్మాత చలసాని అశ్వనీదత్ చౌదరి చేసిన వ్యాఖ్యలను అమరావతి కాపునాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యర్రంశెట్టి అంజిబాబు గురువారం ఖండించారు. ముద్రగడపై ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. అశ్వనీదత్ ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ముద్రగడను వాడు, వీడు అంటూ సంబోధించడాన్ని తప్పుబట్టారు. కుల అహంకారంతో ముద్రగడను దూషించిన అశ్వనీదత్‌కు కాపుల నుంచి ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. కాపులది పిచ్చి ఉద్యమమని వ్యాఖ్యానించి.. కాపు జాతిని అవమానించారని మండిపడ్డారు. -
ఊరికొక్కడు
-
టీడీపీలో వలసల చిచ్చు
భీమవరం అర్బన్, న్యూస్‌లైన్ : భీమవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. టీడీపీలో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) చేరడం.. ఆయనకే అసెంబ్లీ టికెట్ ఖరారు చేస్తారనే ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు రగిలిపోతున్నట్టు సమాచారం. మూడు దశాబ్దాలుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న మెంటే పార్థసారథి భీమవరం టికెట్ ఆశిస్తున్నారు. ఇటీవల ముని సిపల్ చైర్మన్ అభ్యర్థిగా మెంటేను పోటీ చేయమని పార్టీ పెద్దలు ఒత్తిడి చేసినా ఆయన అంగీకరించకపోవడమే ఇందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో మునిసిపల్ ఎన్నికలు జరుగుతుండటంతో అంజిబాబుకు టికెట్ ఇచ్చే విష యం బహిర్గతం కాకుండా అధిష్టానం నానా తంటాలు పడుతోందట. అంజిబాబుకు ఇప్పుడే టికెట్ కేటాయిస్తే మునిసిపల్ ఎన్నికల్లో విజయావకాశాలు దెబ్బతింటాయని నేతలు భావిస్తున్నారని సమాచారం. ఇదిలా ఉండగా మునిసిపల్ ఎన్నికల్లో టీడీపీను గెలిపించి అసెంబ్లీ టికెట్ పొం దాలనే యోచనలో మెంటే చెమటోడుస్తున్నారు. అయితే మునిసిపల్ ఫలితాలు వెలువడిన వెంటనే మెంటేను పక్కనపెట్టి అంజిబాబును తెరపైకి తీసుకొచ్చేందుకు దాదాపు రంగం సిద్ధమైందని ఆ పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. సీతమ్మ చెప్పుచేతల్లోనే.. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి చెప్పుచేతల్లోనే అభ్యర్థుల ఎంపిక చేస్తారని.. మునిసిపల్ అభ్యర్థులను ఇలానే ఎంపిక చేశారని పార్టీ కేడర్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. మెంటేకు సీతారామలక్ష్మికి ఇటీవల విభేదాలు భగ్గుమన్న నేపథ్యంలో అంజిబాబుకు భీమవరం టికెట్ ఇచ్చే విషయంలో కూడా ఆమె ప్రముఖ పాత్ర వహిస్తున్నట్టు సమాచారం. మెంటే మాత్రం అసెంబ్లీ టికెట్ తనకే ఇస్తారనే నమ్మకంతో ఉన్నారు. ఏది ఏమైనా మునిసిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలయ్యేంత వరకూ అంజిబాబు టికెట్ వ్యవహారం గోప్యంగా ఉంచనున్నారని తెలిసింది. లేకపోతే ఆయా ఎన్నికల్లో పరాభవం తప్పదనే గుబులు పార్టీ పెద్దలకు పట్టుకుందట. సుదీర్ఘకాలం టీడీపీ జెండా మోసిన మెంటే పార్థసారథి ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి మరి.