భీమవరం: బూటకపు హామీలతో ప్రజలను మోసం చేసిన చంద్రబాబును ప్రజలంతా నిన్ను నమ్మంబాబూ అంటుంటే.. భీమవరం జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) మాత్రం టీడీపీ నాయకులను నమ్మే పరిస్థితి లేదని పలువురు అంటున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యరి్థగా పోటీచేసిన అంజిబాబు ఓటర్లకు పంపిణీ కోసం ఇచ్చిన సొమ్మును సైతం తెలుగుదేశం పార్టీ నాయకులు స్వాహా చేయడంతో పోలింగ్ రోజున ఓటర్లు ఆ పార్టీ కార్యాలయానికి వచ్చి గందరగోళం సృష్టించారు. అప్పటి ఎన్నికల్లో అంజిబాబు ఘోరంగా ఓడిపోగా ఆయనకు చంద్రబాబు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకపోవడంతో ఐదేళ్లుగా పార్టీకి దూరంగా ఉంటూ వ్యా పార, వ్యవహారాలు చక్కబెట్టుకున్నారు. దీంతో భీమవరం నియోజకవర్గంలో టీడీపీ చుక్కాని లేని నావలా మారింది.
ఇదిలా ఉండగా ప్రస్తుత ఎన్నికల్లో అంజిబాబు జనసేన పార్టీ అభ్యరి ్థగా బరిలో నిలిచారు. పార్టీలు మారడంలో దిట్ట అనే ముద్ర వేసుకున్న అంజిబాబు నుంచి అందిన కాడికి అందిపుచ్చుకోవాలనే ప్రయత్నాలు టీడీపీ శ్రేణులు ప్రారంభించినట్టు ప్రచారం జరుగుతోంది. ఎంతోకొంత ఆయన నుంచి చేజిక్కుంచుకోకపోతే ఇంతకాలం పార్టీ కోసం పనిచేస్తున్నందుకు ప్రయోజనం ఏంటనే నిర్ణయానికి టీడీపీ శ్రేణులు వచ్చినట్టు తెలిసింది. ఇప్పటికే టీడీపీ ముఖ్య నాయకులు అంజిబాబు అభ్యరి్థత్వాన్ని వ్యతిరేకిస్తుండగా ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు సొమ్ముల కోసం జనసేన పార్టీ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారంట.
సొంత మనుషులతోనే కార్యాచరణ
టీడీపీ, జనసేన నాయకులు ఎన్నికల్లో పెత్తనం చేయడానికి ప్రయత్నించగా గత అనుభవాల దృష్ట్యా అంజిబాబు జాగ్రత్త పడినట్లు చెబుతున్నారు. దీంతో నామినేషన్ కార్యక్రమానికి జనాన్ని తరలించడం దగ్గర నుంచి ఎన్నికల ప్రచార వ్యవహారాలు కూడా తన బంధువులు, కావాల్సిన వారితోనే చేయిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా డబ్బులు విషయంలో అంజిబాబు అతి జాగ్రత్తగా వ్యవహరించడం టీడీపీ, జనసేన కేడర్‌కు మింగుడు పడటంలేదు. ఎన్నికల్లో ఓడిపోతే అంజిబాబు పత్తా ఉండరు కాబట్టి అయినకాడికి దండుకునే ప్రయత్నాలను కేడర్ చేస్తున్నట్టు తెలిసింది. దీంతో సొంత మనుషులతోనే అంజిబాబు ఎన్నికల కా ర్యాచరణ రూపొందించినట్టు సమాచారం.
జనసేన శ్రేణుల చిందులు
నరసాపురం: పట్టణంలోని దర్గా సెంటర్‌లో జనసేన ప్రచార కార్యక్రమంలో ఇద్దరు జర్నలిస్టులపై ఆ పార్టీనాయకులు అసభ్య పదజాలంతో దూషణలు దిగడం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. సోమవారం డ్యాన్ మాస్టర్ శేఖర్ దర్గా సెంటర్‌లో జనసేన తరఫున ప్రచార కార్యక్రమానికి వచ్చారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంలో కవరేజీకి వెళ్లిన ఓ పత్రిక విలేకరి, మరో న్యూస్ చానల్ జర్నలిస్ట్‌పై అక్కడున్న జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్ కెమెరామెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫొటోలకు అడ్డువస్తున్నారు, మీరు ఎవరు? అంటూ రుసరుసలాడాడు.
తాము జర్నలిస్టులమని చెప్పబోతుండగా.. జర్నలిస్టులైతే ఐడీ కార్డులు వేసుకుని తిరగాలని గర్జించారు. ‘నేనవరు అనుకుంటున్నావు.. నాయకర్ కెమెరామెన్‌ని, కాబోయే మంత్రి మనిషిని’ అంటూ శివాలెత్తారు. ఇప్పటికే నాయకర్ వ్యవహార తీరుపై నియోజకవర్గంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా నాయకర్ అనుయాయుల దురుసు ప్రవర్తనతో ముందుకు వెళుతున్నారు. జనసేన తీరుపై జర్నలిస్టు సంఘాలు మండిపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment