త్రివిక్రమ్ దర్శకత్వంలో మెగాస్టార్..? | Chiranjeevi 152 movie with trivikram srinivas | Sakshi
Sakshi News home page

త్రివిక్రమ్ దర్శకత్వంలో మెగాస్టార్..?

Published Wed, Oct 19 2016 12:51 PM | Last Updated on Mon, Sep 4 2017 5:42 PM

త్రివిక్రమ్ దర్శకత్వంలో మెగాస్టార్..?

త్రివిక్రమ్ దర్శకత్వంలో మెగాస్టార్..?

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీలో ఫుల్ ఫాంలో ఉన్నాడు. హీరో క్యారెక్టర్కు సూట్ అవుతాడా అన్న అనుమాలకు ఫుల్ స్టాప్ పెడుతూ, యంగ్ లుక్లో వావ్ అనిపిస్తున్నాడు. కుర్ర హీరోలకు పోటి ఇచ్చేలా ఉన్న చిరు లుక్స్ సినిమా మీద అంచనాలను పెంచేస్తున్నాయి. లుక్స్ విషయంలోనే కాదు స్పీడులో కూడా కుర్రహీరోలను సవాల్ చేస్తున్నాడు మెగాస్టార్.

చిరు హీరోగా తెరకెక్కుతున్న 150వ సినిమా సెట్స్ మీద ఉండగానే ఆయన చేయబోయే 151, 152 సినిమాలపై కూడా జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. మెగాస్టార్ 151వ సినిమాను అల్లు అరవింద్ నిర్మిస్తారని,  మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.

అంతేకాదు 152వ సినిమాకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఇటీవల చిరంజీవితో త్వరలో సినిమా నిర్మిస్తానంటూ మెగా ప్రొడ్యూసర్ అశ్వనీదత్ ప్రకటించిన నేపథ్యంలో.., అది చిరు 152వ సినిమానే అన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించే అవకాశం ఉంది. ఈ రూమర్స్పై మెగా క్యాంప్ ఎలాంటి ప్రకటనా చేయకపోయినా ఖండించకపోవటంతో ఈ న్యూస్ నిజమే అంటూ అభిమానులు ఖుషీ అవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement