చిరు బాటలో పవన్..!
రాజకీయాల్లో బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం తివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్నా.. ఇంత వరకు సినిమాకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సినిమా టైటిల్ పై రకరకాల రూమర్స్ వినిపిస్తున్నా,, చిత్రయూనిట్ మాత్రం అఫీషియల్ గా టైటిల్ ను ఎన్సౌన్స్ చేయలేదు.
అయితే త్వరలోనే పవన్, త్రివిక్రమ్ ల సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారట. తాజాగా చిరంజీవి పుట్టిన రోజున ఉయ్యాలవాడ నరసింహారెడ్డి టైటిల్ లోగో రిలీజ్ అవుతుందన్న లీక్ ఇచ్చారు మెగా టీం. అదే బాటలో పవన్ కూడా తన పుట్టిన రోజున తాజా చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారట. సెప్టెంబర్ 2న సినిమా టైటిల్ తో పాటు ఈ సినిమాలో పవన్ ఎలా కనిపించబోతున్నాడో రివీల్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.