'చిరు, పవన్‌ ఎంత బిజీగా ఉన్నా సినిమా తీస్తా' | how busy may be chiranjeevi and pawan, i will make movie, says subbirami reddy | Sakshi
Sakshi News home page

'చిరు, పవన్‌ ఎంత బిజీగా ఉన్నా సినిమా తీస్తా'

Published Fri, Feb 3 2017 6:42 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

'చిరు, పవన్‌ ఎంత బిజీగా ఉన్నా సినిమా తీస్తా' - Sakshi

'చిరు, పవన్‌ ఎంత బిజీగా ఉన్నా సినిమా తీస్తా'

చిరంజీవి, పవన్ కల్యాణ్ ఇద్దరూ ఎంత బిజీగా ఉన్నా కూడా వాళ్లిద్దరితో కలిపి ఒక మల్టీస్టారర్ సినిమా తీస్తానని కళాబంధు టి.సుబ్బిరామిరెడ్డి తెలిపారు. సినిమాలకు, రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేదని, సినిమాకు కథ మాత్రమే ముఖ్యమని ఆయన అన్నారు. ఇద్దరి ఇమేజ్‌కు తగ్గట్లుగా సినిమా తీస్తానని టీఎస్ఆర్ వివరించారు. 
 
సుబ్బిరామిరెడ్డితో పాటు అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్న విషయం తెలిసిందే. అన్నదమ్ములు చిరు, పవన్ కలిసి ఒకే సినిమాలోనటిస్తున్నారన్న వార్త అభిమానులను ఖుషీ చేస్తోంది. ఇంతకుముందు కూడా ఈ విషయం ప్రచారంలోకి వచ్చినా, అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఇప్పుడు స్వయంగా సుబ్బిరామిరెడ్డే ప్రకటించడంతో ఇక ఇది అఫీషియల్ అయిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement