multi starer movie
-
స్టార్ హీరోతో కిరణ్ అబ్బవరం మల్టీస్టారర్!
వరుస చిత్రాలతో బిజీగా దూసుకెళుతున్నారు హీరో కిరణ్ అబ్బవరం. ఓ వైపు హీరోగా నటిస్తూనే మరోవైపు తన చిత్రాల్లో కొన్నింటికి కథలు కూడా రాసుకుంటున్నారాయన. ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం, నేను మీకు బాగా కావాల్సినవాడిని’ చిత్రాలకు కథ అందించిన కిరణ్ తాజాగా ఓ మల్టీస్టారర్ మూవీ కోసం కథ సిద్ధం చేస్తున్నారు. (చదవండి: అందుకు పదేళ్లు పట్టింది) ఓ స్టార్ హీరో నటించనున్న ఈ చిత్రంలో కిరణ్ కూడా ఓ హీరోగా నటించనున్నారు. నూతన దర్శకుడు తెరకెక్కించనున్న ఈ మల్టీస్టారర్ మూవీని ఓ పెద్ద సంస్థ నిర్మించనుంది. ఈ సినిమాతో పాటు మరో మూడు భారీ ప్రాజెక్టుల్లో నటించ నున్నారు కిరణ్. కాగా రత్నం కృష్ణ దర్శకత్వంలో కిరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రూల్స్ రంజన్’ విడుదలకు సిద్ధం అవుతోంది. -
మరో ఊర మాస్ కాంబినేషన్ స్టోరీ కూడా లీక్?
-
మరో మల్టీస్టారర్‌కి అక్కినేని హీరోలు రెడీ
మంచి కథ దొరికితే చాలు అక్కినేని హీరోలు మల్టీస్టారర్ కు జై కొడతారు.ఇప్పటికే మనం లాంటి క్లాసిక్ మూవీని టాలీవుడ్ కు అందించారు. ఈ సంక్రాంతికి బంగార్రాజుతో మరోసారి అక్కినేని ఫ్యామిలీ మల్టీస్టారర్ అందించింది. ఇప్పుడు ఇదే స్పీడ్ లో ఇంకో మల్టీస్టారర్ కు అక్కినేని హీరోలు రెడీ అవుతున్నారట.మనం, బంగార్రాజు చిత్రాల్లో నాగ చైతన్యతో కలసి నటించిన నాగార్జున..ఇప్పుడు అఖిల్ తో కలసి మల్టీస్టారర్ మూవీ చేసేందుకు రెడీ అవుతున్నాడట. ఈ మూవీని చిరుతో గాడ్ ఫాదర్ తెరకెక్కిస్తున్న మోహన్ రాజా ప్లాన్ చేస్తున్నాడట.అయితే ఇప్పటికిప్పుడు ఈ మల్టీస్టారర్ సెట్స్ పైకివెళ్లే అవకాశలు లేవు. అఖిల్ ఏజెంట్ మూవీ షూటింగ్ లోనూ,నాగార్జున ది ఘోస్ట్ మూవీలోనూ నటిస్తున్నాడు. మరోవైపు బంగార్రాజుకు సీక్వెల్ వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సీక్వెల్ నాగచైతన్య, అఖిల్‌తో కలిసి నాగార్జున నటించనున్నాడు. మొత్తానికి అక్కినేని హీరోల మల్టీస్టారర్స్ లిస్ట్ పెరుగుతుందన్నమాట. -
మెగా, అక్కినేని హీరోల కాంబో భారీ మల్టీస్టారర్?
మెగాహీరోల్లో ఒక్కోక్కరిది ఒక్కో శైలి. ఎవరి పంథాలో వాళ్లు దూసుకుపోతున్నారు. వారందరికంటే భిన్నంగా ఆలోచిస్తున్నాడు సుప్రీమ్ హీరో సాయి తేజ్. కమర్షియల్ మూవీస్ చేస్తూనే చాలా కాలంగా మల్టీస్టారర్ చేయాలనుకుంటున్నాడు. కాని కుదరడంలేదు. ఇప్పుడు ఆ ప్రయత్నం ఒక కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. నిజానికి సాయిధరమ్ తేజ్, నందమూరి కల్యాణ్ రామ్ తో ఓ మల్టీస్టారర్ చేయాల్సి ఉంది. కాని ఈ ప్రాజెక్ట్ పెండింగ్ లోకి వెళ్లిపోయింది. 1982 సూపర్ హిట్ బిల్లా రంగా సీక్వెల్లో మంచు మనోజ్, సాయి ధరమ్ తేజ్ కలసి నటించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఎందుకో కుదరడం లేదు. గత ఏడాది వరుణ్ తేజ్ తో కలసి సాయి ధరమ్ తేజ్ ఒక మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నాడని టాక్ వినిపించింది. ఈ మెగా మల్టీస్టారర్ ను గీతా ఆర్ట్స్ నిర్మించనున్నట్లు ప్రచారం సాగింది. కాని ఇంతలో కరోనా ఎంట్రీ ఇవ్వడంతో ఈ మెగా మల్టీస్టారర్ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి పక్కకు వెళ్లింది. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ దగ్గరికి ఒక మల్టీస్టారర్ స్టోరీ వెళ్లిందట. ఈ సినిమాను అక్కినేని అఖిల్ లేదా అక్కినేని నాగ చైతన్య తో కలసి నటించాలనుకుంటున్నాడట తేజ్. మరి ఈసారైనా ఈ మెగా హీరో మెగా మల్టీస్టారర్ డ్రీమ్ నెరవేరుతుందా లేక రూమర్ గా మిగిలిపోతుందా అన్నది కొద్ది రోజులు ఆగితే తెల్సిపోతుంది. -
కసితో బాలా.. భారీ మల్టిస్టారర్‌కు ప్లాన్!
సాక్షి, తమిళసినిమా: దర్శకుడు బాలా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సేతు చిత్రంతో విక్రమ్‌కు, నందా చిత్రంతో సూర్యకు, నాన్ కడవుల్ చిత్రంతో ఆర్యకు లైఫ్ ఇచ్చిన దర్శకుడీయన. దర్శకుడిగా వైవిధ్యానికి మారుపేరుగా పేరొందిన ఆయన.. తొలిసారిగా ఒక రీమేక్ చిత్రాన్ని తెరకెక్కించడానికి అంగీకరించడం గతంలో చాలామందిని ఆశ్చర్యపరిచింది. అదే తెలుగులో సంచలన విజయాన్ని సాధించిన అర్జున్‌రెడ్డి చిత్రం. ఈ చిత్ర తమిళ రీమేక్‌లో విక్రమ్ కొడుకు ధ్రువ్‌ను హీరోగా పరిచయం చేయాలని ఆయన భావించారు. వర్మ చిత్రాన్ని ఆయన రీమేక్ చేసినప్పటికీ.. చిత్రీకరణ అంతా పూర్తయిన తరువాత నిర్మాతలు ఇది అసలు అర్జున్‌రెడ్డి చిత్రానికి రీమేక్‌లా లేదు, బాలా సరిగా తీయలేదంటూ పక్కన పడేశారు. నూతన దర్శకుడితో ఆదిత్యవర్మ పేరుతో మళ్లీ ఆ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇంతకంటే బాలాకు జరిగిన అవమానం వేరే ఉండదు. దీంతో ఆయన చాలా కసిగా ఒక కథను తయారు చేశారని సమాచారం. విశేషం ఏమిటంటే ఇది మల్టీస్టారర్ సినిమా. ఇందులో నటించడానికి సూర్య సమ్మతించినట్లు సమాచారం. అంతేకాదు మరో హీరోగా నటుడు ఆర్య, అధర్వ కూడా నటించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. విశేషం ఏమిటంటే ఈ ముగ్గురు ఇంతకుముందు బాలా దర్శకత్వంలో నటించినవారే. వారిప్పుడు ఆయనకు అండగా నిలవడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో ప్రతినాయకుడిగా బాహుబలి ఫేమ్ రానాను నటింపజేసే ఆలోచనలో ఉన్నట్లు తాజా సమాచారం. ఇక కథానాయికలుగా మహిమ, బిందుమాధవి నటించే అవకాశమున్నట్లు తెలిసింది. ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన అధికార ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశముంది. ఈ సినిమా సూపర్‌హిట్ అవ్వాలన్న కసి, పట్టుదలతో బాలా ఉన్నట్టు తెలిసింది. దీంతో ఈ మల్టీస్టారర్ చిత్రంపై ఇప్పటికే హైప్ క్రియేట్ అయింది. -
మల్టీస్టారర్ వైపు మళ్లారా?
భారీ సినిమాలకు శంకర్ పెట్టింది పేరు. ఆయన సినిమాల్లో కథ ఎంత భారీగా ఉంటుందో, ఖర్చు కూడా అంతే భారీగా ఉంటుంది. ప్రస్తుతం కమల్‌హాసన్‌తో ‘భారతీయుడు 2’ చిత్రాన్ని రూపొందించే బిజీలో ఉన్నారు శంకర్. ఎన్నికల కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. అయితే కోలీవుడ్‌లో లేటెస్ట్గా వినిపిస్తున్న వార్తేంటంటే ‘భారతీయుడు 2’ షూటింగ్ అనుకున్న దానికంటే ఎక్కువ సమయం వాయిదా పడేలా ఉందని, లైకా ప్రొడక్షన్స్ సంస్థ కూడా బడ్జెట్ విషయంలో సుముఖంగా లేదని టాక్. దాంతో శంకర్ ఈ ప్రాజెక్ట్‌ను కొద్ది రోజులు పక్కన పెట్టి ఓ కొత్త ప్రాజెక్ట్ రూపొందించాలనే ప్లాన్‌లో ఉన్నారట. విజయ్ – విక్రమ్ కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారని చెన్నై సమాచారం. భారతీయుడా? మల్టీస్టారర్ మూవీయా? చెన్నైలో ఉండే ఆ శంకరుడే క్లారిటీ ఇవ్వాలి. -
శింబు, అనుష్కలతో మల్టీస్టారర్ చిత్రం?
తమిళ సినిమా: దర్శకుడు గౌతమ్‌మీనన్ మల్టీస్టారర్ చిత్రం గురించి మరోసారి వార్తల్లో నానుతోంది. ఈ దర్శకుడు ప్రస్తుతం విక్రమ్ హీరోగా ధ్రువనక్షత్రం, ధనుష్ కథానాయకుడిగా ఎన్నై నోక్కి పాయుమ్ తూట్టా చిత్రాలు చేస్తున్నారు. అయితే ఈ రెండు చిత్రాలు చాలా కాలం నిర్మాణంలో ఉన్నాయన్నది గమనార్హం. అదే విధంగా గోలీసోడా–2 చిత్రంలో గౌతమ్‌మీనన్ ఒక ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. గౌతమ్‌మీనన్ ఇది వరకే ఒక మల్టీస్టారర్ చిత్రం చేయనున్నట్లు ప్రకటించారు. తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లో తెరకెక్కించే ఈ చిత్రంలో నాలుగు భాషలకు చెందిన ప్రముఖ నటులు హీరోలుగా నటిస్తారని, హీరోయిన్గా అనుష్క నటిస్తారని వెల్లడించారు. నటి అనుష్క కూడా భాగమతి చిత్ర ప్రచారం కార్యక్రమంలో తాను దర్శకుడు గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో నటించడానికి అంగీకరించినట్లు తెలిపారు. ఆ క్రేజీ చిత్రాన్ని త్వరలో ప్రారంభించడానికి గౌతమ్‌మీనన్ సన్నాహాలు చేస్తున్నట్లు తాజాగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ మల్టీస్టారర్ చిత్రంలో తమిళ వెర్షన్లో హీరోగా నటుడు మాధవన్ నటించనున్నట్లు దర్శకుడు గౌతమ్‌మీనన్ ఇంతకు ముందు తెలిపారు. అయితే ఇప్పుడా పాత్రలో నటుడు శింబును నటింపజేయడానికి చర్చలు జరిపిన్నట్లు ప్రచారం. ఇక మలయాళ వెర్షన్లో టోవినో థామస్, కన్నడంలో పునీత్ రాజ్‌కుమార్ హీరోలుగా నటించనున్నారు. అదే విధంగా తెలుగులో ఒక ప్రముఖ నటుడి నటింపజేయడానికి చర్చలు జరుపుతున్నట్లు టాక్. ఇకపోతే ఇందులో అనుష్క హీరోయిన్గా నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. శింబు,గౌతమ్‌మీనన్‌ల కాంబినేషన్లో ఇంతకు ముందు విన్నైతాండి వరువాయా, అచ్చం యంబదు మడమయడా వంటి సక్సెస్ఫుల్ చిత్రాలు వచ్చాయన్నది తెలిసిందే. ఈ మల్టీస్టారర్ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలతో అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం. -
చార్మింగ్ పెయిర్
మూడు హిట్ సినిమాల తర్వాత మారోసారి జోడీ కట్టనున్నారు వెంకటేశ్, నయనయతార. ‘లక్ష్మీ, తులసి, బాబు బంగారం’.. ఇలా మూడు సార్లు సిల్వర్ స్కీన్‌పై సందడి చేసి, చార్మింగ్ పెయిర్ అనిపించుకున్న ఈ జోడీ ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్‌కి శ్రీకారం చుట్టారని సమాచారం. కేయస్ రవీందర్ (బాబీ) దర్శకత్వంలో వెంకటేశ్, నాగచైతన్య ఓ మల్టీస్టారర్ మూవీలో యాక్ట్ చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో వెంకటేశ్ సరసన హీరోయిన్గా నయనతార పేరుని పరిశీలిస్తుందట చిత్రబృందం. నాగచైతన్య పక్కన హీరోయిన్ ఎవరన్నది తెలియాల్సి ఉంది. సురేశ్ ప్రొడక్షన్స్, కోనా ఫిల్మ్ కార్పొరేషన్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమా ఈ సంవత్సరం చివర్లో సెట్స్ పైకి వెళ్లనుందట. -
మల్టీస్టారర్స్‌తో భారీ చిత్రం
సాక్షి, గుంటూరు : మల్టీస్టారర్ భారీ చిత్రానికి రూపకల్నన చేస్తున్నట్టు ప్రముఖ సినీ దర్శకులు అనిల్ రావిపూడి చెప్పారు. గణపవరం శ్రీ చుండి రంగనాయకులు ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం జరిగిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, చిన్నతనం నుంచి కళలంటే ఎంతో అభిమానమని, సినిమాలు ఎక్కువగా చూసేవాడినని, 2015లో తన బాబాయి అరుణ్ ప్రసాద్ ప్రోద్బలంతో సినీరంగ ప్రవేశం చేసినట్లు చెప్పారు. 2015కు ముందు కంత్రీ, శౌర్యం, గౌతమ్ ఎస్ఎస్సీ, కందిరీగ, మరికొన్ని సినిమాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశానని తెలిపారు. 2015లో పటాస్ సినిమాకు దర్శకత్వం వహించానన్నారు. ఆ తర్వాత సుప్రీం, రాజా ది గ్రేట్ సినిమాలకు దర్శకత్వం వహించానని పేర్కొన్నారు. త్వరలో దగ్గుబాటి వెంకటేశ్‌తో మల్టీస్టారర్ సినిమాకు రూపకల్పన చేశానని, సినిమాల్లో నాణ్యత, కొత్తదనం చూపే వారికి భవిష్యత్తు ఉంటుందన్నారు. తన స్వగ్రామం యద్దనపూడి మండలం, చిలుకూరివారిపాలెం అని గుంటూరు విజ్ఞాన్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేసి 2005లో సినీరంగంలో అడుగు పెట్టానన్నారు. సినీరంగంలో దిల్రాజాతో పాటూ మరికొంతమంది తనకు ప్రోత్సాహం అందిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో అవకాశం వస్తే పెద్ద హీరోల సినిమాలకు దర్శకత్వం వహించి టర్నింగ్ పాయింట్ సాధిస్తానన్నారు. -
ఎన్ అండ్ ఎన్... న్యూ ఇయర్లో బిగిన్!
ఎన్ ఫర్... నాగార్జున. ఎన్ ఫర్... నాని. వీళ్లిద్దరూ హీరోలుగా ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ పతాకంపై ‘భలే మంచి రోజు’, ‘శమంతకమణి’ సిన్మాల ఫేమ్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో సి. అశ్వనీదత్ ఓ మల్టీస్టారర్ నిర్మించనున్నారని గతంలోనే ‘సాక్షి’ తెలియజేసింది. నాగార్జునతో ‘ఆఖరి పోరాటం, గోవిందా గోవింద, రావోయి చందమామ, ఆజాద్’ వంటి హిట్ సిన్మాలను వైజయంతి సంస్థ నిర్మించింది. ఇక, వైజయంతి అనుబంధ సంస్థ స్వప్న సినిమాస్ నాని ‘ఎవడే సుబ్రమణ్యం’ను నిర్మించింది. ఇప్పుడు నాగ్, నానీ హీరోలుగా నిర్మించనున్న మల్టీస్టారర్‌కి కొత్త ఏడాదిలో కొబ్బరికాయ కొట్టనున్నారు. న్యూ ఇయర్ బిగినింగ్ మంత్ జనవరిలోనే ఈ సినిమా బిగిన్ కానుంది. ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్‌బాబు మొదలుకుని చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వరకూ, అలాగే పవన్‌కల్యాణ్, మహేశ్‌బాబు, రామ్‌చరణ్‌లతో పలు సూపర్‌హిట్ సిన్మాలను నిర్మించిన వైజయంతి మూవీస్ సంస్థ కొంత విరామం తర్వాత నిర్మిస్తున్న చిత్రమిది. సి. అశ్వనీదత్ మాట్లాడుతూ– ‘‘నాగార్జున, నానీలకు కథ బాగా నచ్చింది. ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. సరికొత్త జోనర్లో శ్రీరామ్ ఆదిత్య సినిమా తీయబోతున్నారు’’ అన్నారు. -
'చిరు, పవన్ ఎంత బిజీగా ఉన్నా సినిమా తీస్తా'
చిరంజీవి, పవన్ కల్యాణ్ ఇద్దరూ ఎంత బిజీగా ఉన్నా కూడా వాళ్లిద్దరితో కలిపి ఒక మల్టీస్టారర్ సినిమా తీస్తానని కళాబంధు టి.సుబ్బిరామిరెడ్డి తెలిపారు. సినిమాలకు, రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేదని, సినిమాకు కథ మాత్రమే ముఖ్యమని ఆయన అన్నారు. ఇద్దరి ఇమేజ్‌కు తగ్గట్లుగా సినిమా తీస్తానని టీఎస్ఆర్ వివరించారు. సుబ్బిరామిరెడ్డితో పాటు అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్న విషయం తెలిసిందే. అన్నదమ్ములు చిరు, పవన్ కలిసి ఒకే సినిమాలోనటిస్తున్నారన్న వార్త అభిమానులను ఖుషీ చేస్తోంది. ఇంతకుముందు కూడా ఈ విషయం ప్రచారంలోకి వచ్చినా, అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఇప్పుడు స్వయంగా సుబ్బిరామిరెడ్డే ప్రకటించడంతో ఇక ఇది అఫీషియల్ అయిపోయింది. -
ఇప్పటికి నిజమైంది!
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మసాలా, పాండవులు పాండవులు తుమ్మెద... ఇలా వరుసగా మల్టీస్టారర్ మూవీస్ వస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మరికొన్ని మల్టీస్టారర్ చిత్రాలు ప్రేక్షకులను అలరించబోతున్నాయి. వాటిలో వెంకటేష్, పవన్‌కల్యాణ్ చిత్రం ఒకటి. ఇది కచ్చితంగా క్రేజీ కాంబినేషనే. వెంకీకి ఇది తొలి మల్టీస్టారర్ కాదని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పవన్‌కి మాత్రం ఇదే తొలి సినిమా. పైగా ఎప్పట్నుంచో ఈ ఇద్దరూ కలిసి నటించాలనుకుంటున్నారు. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో వెంకటేషే స్వయంగా చెప్పారు. మంచి కథ కుదిరితే చేయడానికి అభ్యంతరం లేదని పవన్ కూడా చెప్పిన దాఖలాలు ఉన్నాయి. ఈ రెండేళ్లల్లో ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా రూపొందనుందనే వార్తలు చాలాసార్లు వచ్చాయి. కానీ, అవేవీ నిజం కాలేదు. ఈసారి నిజమైంది. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్‌బాబు, నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ సంస్థ అధినేత శరత్ మరార్ ఈ చిత్రం నిర్మించనున్నారు. ఇంగ్లిష్ మూవీ ‘మేన్ హు స్యూడ్’, హిందీ చిత్రం ‘ఓ మై గాడ్’ ఆధారంగా ఈ సినిమా రూపొందించనున్నారు. ఇద్దరు స్టార్ హీరోలతో ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం రావడం ఆనందంగా ఉందని శరత్ తెలియజేయగా, పూర్తి వివరాలను త్వరలో చెబుతామని సురేష్‌బాబు తెలిపారు. -
మరో మల్టీస్టారర్.. ఈసారి నాగార్జున, మహేష్!!
తెలుగులో కూడా మల్టీ స్టారర్ చిత్రాల హవా గట్టిగానే వస్తోంది. నిన్న కాక మొన్న వెంకటేష్, మహేష్ బాబు కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టును పండిస్తే, ఇప్పుడు మళ్లీ మహేష్ బాబు మరో అగ్రనటుడు, గ్రీకువీరుడు అక్కినేని నాగార్జునతో కలిసి ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాకు దర్శకుడెవరో తెలుసా.. మణి రత్నం!! తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ సినిమా స్క్రిప్టు మీద మణిరత్నం ఇప్పటికే చాలా సీరియస్‌గా పనిచేస్తున్నారు. మణిరత్నం గతవారమే నాగార్జునను కలిశారని, ఈ చిత్రం గురించి చర్చించారని, మహేష్‌తో కలిసి సినిమా చేయడం ఇష్టమేనా కాదా అని అడిగారని నాగార్జున మేనేజర్ తెలిపారు. తనకు ఏమాత్రం అభ్యంతరం లేదని నాగార్జున సమాధానం ఇచ్చారన్నారు. అయితే స్క్రిప్టు ఇంకా పూర్తిగా సిద్ధం కాలేదని, త్వరలోనే స్క్రిప్టుతో వస్తారని చెప్పారు. మహేష్ బాబు కూడా నాగ్‌తో కలిసి చేసేందుకు ఆసక్తి చూపించినట్లు తెలిసింది. అంజలి, గీతాంజలి, రోజా, దిల్ సే, దళపతి లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు తీసిన మణిరత్నం.. ఇటీవలి కాలంలో మాత్రం పెద్ద హిట్లు కొట్టలేకపోయారు. ఈ మల్టీస్టారర్ ఆయనను ఆదుకుంటుందేమో చూడాలి.