మల్టీస్టారర్‌ వైపు మళ్లారా? | Shankar might take up a multi-starrer movie | Sakshi
Sakshi News home page

మల్టీస్టారర్‌ వైపు మళ్లారా?

Published Thu, May 2 2019 12:52 AM | Last Updated on Thu, Aug 8 2019 11:13 AM

Shankar might take up a multi-starrer movie - Sakshi

భారీ సినిమాలకు శంకర్‌ పెట్టింది పేరు. ఆయన సినిమాల్లో కథ ఎంత భారీగా ఉంటుందో, ఖర్చు కూడా అంతే భారీగా ఉంటుంది. ప్రస్తుతం కమల్‌హాసన్‌తో ‘భారతీయుడు 2’ చిత్రాన్ని రూపొందించే బిజీలో ఉన్నారు శంకర్‌. ఎన్నికల కారణంగా ఈ సినిమా షూటింగ్‌ వాయిదా పడింది. అయితే కోలీవుడ్‌లో లేటెస్ట్‌గా వినిపిస్తున్న వార్తేంటంటే ‘భారతీయుడు 2’ షూటింగ్‌ అనుకున్న దానికంటే ఎక్కువ సమయం వాయిదా పడేలా ఉందని, లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ కూడా బడ్జెట్‌ విషయంలో సుముఖంగా లేదని టాక్‌. దాంతో శంకర్‌ ఈ ప్రాజెక్ట్‌ను కొద్ది రోజులు పక్కన పెట్టి ఓ కొత్త ప్రాజెక్ట్‌ రూపొందించాలనే ప్లాన్‌లో ఉన్నారట. విజయ్‌ – విక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ మల్టీస్టారర్‌ ప్లాన్‌ చేస్తున్నారని చెన్నై సమాచారం. భారతీయుడా? మల్టీస్టారర్‌ మూవీయా? చెన్నైలో ఉండే ఆ శంకరుడే క్లారిటీ ఇవ్వాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement