త్రివిక్రమ్ దర్శకత్వంలో చిరు, పవన్లతో మల్టీ స్టారర్ | trivikram multi starer with Chiru, Pawan | Sakshi
Sakshi News home page

త్రివిక్రమ్ దర్శకత్వంలో చిరు, పవన్లతో మల్టీ స్టారర్

Published Thu, Feb 2 2017 4:20 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

త్రివిక్రమ్ దర్శకత్వంలో చిరు, పవన్లతో మల్టీ స్టారర్ - Sakshi

త్రివిక్రమ్ దర్శకత్వంలో చిరు, పవన్లతో మల్టీ స్టారర్

ఇటీవల ఖైదీ నంబర్ 150 సినిమా సందర్భంగా మెగాస్టార్ కోసం కళాబంధు సుబ్బిరామి రెడ్డి, ఓ గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీలో త్వరలో మెగా ఫ్యామిలీ హీరోలతో ఓ మల్టీ స్టారర్ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు సుబ్బిరామి రెడ్డి. అయితే ఇంత భారీ కాంబినేషన్ సెట్ అవ్వడానికి చాలా సమయం పడుతుందని భావించారు ఫ్యాన్స్. కానీ అతి త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ల కాంబినేషన్లో ఓ సినిమా పట్టాలెక్కనుందట.

సుబ్బిరామిరెడ్డితో పాటు అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నాడు. కొంత కాలంగా మెగా ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్ దూరమవుతున్నాడన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో చిరు, పవన్లు కలిసి ఒకే సినిమాలోనటిస్తున్నారన్న వార్త అభిమానులను ఖుషీ చేస్తోంది. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన లేకపోయినా టాలీవుడ్ సర్కిల్స్లో ఈ వార్త  తెగ హల్చల్ చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement