
ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియన్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదుకోన్ హీరోయిన్. అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దిశా పటానీ కీలక పాత్రలు చేశారు. వైజయంతీ మూవీస్‌పై సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా జూన్ 27న విడుదలవుతోంది.

బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘కల్కి స్పెషల్ క్రియేటివ్ ఈవెంట్’లో సినిమాలోని బుజ్జి (కారు) పాత్రను పరిచయం చేశారు.

ఈవెంట్‌లో ఈ వాహనాన్ని ప్రభాస్ నడిపారు. అనంతరం ప్రభాస్ మాట్లాడుతూ– ‘‘నాగీ మూడేళ్లు నన్ను బుజ్జితో వేధించాడు. ఫైనల్లీ బుజ్జీని పరిచయం చేశాం.

నేనేదో మన డార్లింగ్స్‌కి హాయ్ చెప్పి వెళ్లి΄ోదాం అనుకుంటే ఈ కార్లు.. ఫీట్లు ఏంటి సార్ (నవ్వుతూ). బుజ్జి సూపర్ ఎగ్జయిటింగ్. నేను కూడా ‘కల్కి’ టీజర్, సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాను.

‘కల్కి..’లో అమితాబ్ సార్, కమల్ సార్‌తో పని చేసే అవకాశం ఇచ్చిన అశ్వినీదత్‌గారికి, నాగీ (నాగ్ అశ్విన్)కి థ్యాంక్స్.







































































