అరవిందస్వామితో మిల్కీబ్యూటీ | Milky beauty with Aravinda Swamy | Sakshi
Sakshi News home page

అరవిందస్వామితో మిల్కీబ్యూటీ

Published Thu, Dec 8 2016 3:42 AM | Last Updated on Mon, Sep 4 2017 10:09 PM

అరవిందస్వామితో మిల్కీబ్యూటీ

అరవిందస్వామితో మిల్కీబ్యూటీ

చిన్న విరామం తరువాత రీ ఎంట్రీ ఇచ్చిన నటుడు అరవిందస్వామి అటు విలన్‌గా, ఇటు హీరోగా యమ బిజీ అరుు పోయారు. మణిరత్నం కడలి చిత్రంతో నటుడిగా పునఃప్రవేశం చేసిన ఈ నటుడు ఆ తరువాత తనీఒరువన్ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో దుమ్మురేపారు. ఆ తెలుగు రీమేక్‌లోనూ రామ్‌చరణ్‌కు విలన్‌గా మారారు. దీంతో మళ్లీ కథానాయకుడిగా అవకాశాలు వరుస కడుతున్నారుు. ఇప్పటికే చతురంగవేటై్ట-2 చిత్రంలో హీరోగా నటిస్తున్న అరవిందస్వామికి తాజాగా మరో అవకాశం తలుపుతట్టినట్టు సమాచారం. ఇక అవకాశాలు తెరమరుగయ్యారుు అనుకున్న నటి తమన్నాను బాహుబలి చిత్రం అనూహ్యంగా ఆకాశానికి ఎత్తేసింది. అదే విధంగా తోళా, ధర్మదురై, దేవి చిత్రాలు వరుసగా విజయం సాధించడంతో ముఖ్యంగా కోలీవుడ్‌లో తన క్రేజ్‌ను పెంచుకున్న తమన్న విశాల్‌తో నటించిన కత్తిసండై పొంగల్ రేస్‌కు సిద్ధం అవుతోంది.

ప్రస్తుతం బాహుబలి-2, తమిళంలో శింబుకు జంటగా అన్బాదవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రంలోనూ నటిస్తున్నారు.తాజాగా అరవిందస్వామితో రొమాన్‌‌సకు రెడీ అవుతున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. వీరిద్దరు జంటగా దర్శకుడు సెల్వ ఒక చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇంతకు ముందు నాన్ అవనిల్లై, దానికి సీక్వెల్ అంటూ హిట్ చిత్రాలను తెరకెక్కించిన ఈ దర్శకుడు మరోసారి అదే తరహా రొమాంటిక్ చిత్రాన్ని రూపొందిండానికి రెడీ అవుతున్నారు. ఇందులో ఐదుగురు కథానారుుకలు ఉంటారట. అందులో లీడ్ పాత్రకు నటి తమన్నాను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇక ప్రతినాయకి పాత్రలో నటి ఇనియ నటించనున్నారట. మరో ముగ్గురు నారుుకల ఎంపిక జరుగుతోందని, చిత్రాన్ని జనవరిలో ప్రారంభించనున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement