kadali
-
Kadali: మై వార్డ్రోబ్.. కలర్ఫుల్గా.. కడలి అలలా!
‘కొత్త డ్రెస్ వేసుకుంటే ఆ రోజంతా హుషారుగా అనిపిస్తుంటుంది. అందుకే ఉదయం లేస్తూనే ఆ రోజు వేసుకోదగిన డ్రెస్ గురించి ప్లానింగ్ చేసుకుంటాను’ అంటోంది రచయిత్రి, సాంగ్ రైటర్ కడలి. ఖమ్మం నుంచి హైదరాబాద్ వచ్చి సాహిత్యం, సినిమాల్లో కృషి చేస్తున్న కడలి పాఠకులకు పరిచితమే. ‘రైటర్ అంటే కాటన్స్ మాత్రమే వేసుకోవాలనేం ఉండదు. కంఫర్ట్‌గా ఉండే డ్రెస్సులు ఏవైనా వేసుకోవచ్చు. అందుకే నా వార్డ్‌రోబ్‌లో అన్నీ మోడ్రన్, కలర్‌ఫుల్ డ్రెస్సులు ఉంటాయి’ అంటోంది కడలి.‘‘మన వార్డ్రోబ్ మనకు ఒక అద్దం లాంటిది. ఈ విషయం చెప్పడానికి నేను రాసిన ఒక కథను పరిచయం చేయాలి. ఆ కథలో ఒక యంగ్ అమ్మాయి హీరోయిన్ అవ్వాలనుకుంటుంది. కానీ చుట్టూ రకరకాల మాటలతో డిప్రెస్ అయ్యి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది. రైలు పట్టాల దగ్గరకు వెళ్లి అక్కడ జరిగిన ఒక సంఘటనతో ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. అద్దంలో తన ముఖం చూసుకొని అందంగా తయారవ్వాలనుకుని కళ్లకు కాటుక పెట్టుకుంటుంది. తర్వాత జీవితంపై ఆశతో స్వీయప్రేరణతో తనను మెరుగు చేసుకుంటుంది ఆ కథలో. అంటే మనం ఎలా ఉండాలో మన చుట్టూ ఉన్నవారు డిసైడ్ చేయరు. మనకు మనమే నిర్ణయించుకోవాలి.నాకు నేను ప్రేరణగా!నేను షార్ట్స్ కూడా వేసుకుంటాను. బట్టలను బట్టి ఒక అమ్మాయి వ్యక్తిత్వాన్ని ఎలా జడ్జ్ చేస్తారో ఇప్పటికీ అర్ధం కాదు. అందుకే కొన్ని సభలకు టీ షర్ట్స్, జీన్స్ వేసుకెళతాను. ఈ అమ్మాయా రైటర్ రా?! అని ఆశ్చర్యపోయేవారున్నారు. ఏది సౌకర్యంగా ఉంటుందో అది వేసుకున్నంత మాత్రాన వ్యక్తిత్వానికి మార్కులు వేయకూడదు. ఎవరైనా అలా అన్నా నేను పట్టించుకోను. మీటింగ్ సందర్భాలలో కుర్తీస్ వేసుకుంటాను. రెడీ అవ్వాలి అనిపిస్తే మాత్రం ఏ మాత్రం రాజీ పడను. కాన్ఫిడెంట్‌గా ఉండాలి..నా మనసుకు నచ్చిన డ్రెస్ వేసుకుంటాను కాబట్టి కాన్ఫిడెంట్‌గా కూడా ఉంటాను. నా స్నేహితుల జాబితాలో ఫ్యాషన్ డిజైనర్లు ఉన్నారు. వారి డిజైన్స్ నాతో ట్రై చేస్తుంటారు. వాటిలో నచ్చినవి తీసుకుంటాను.అమ్మ చీరలను కొత్తగా!అమ్మ కట్టుకునే చీరలు చూసి నాకూ అలా చీరలు కట్టుకోవాలనిపిస్తుంది. మా అమ్మకు మూడు బీరువాల చీరలున్నాయి. రెగ్యులర్ చీరలు తప్ప వాటిని కట్టుకోదు. దీంతో అమ్మ చీరలను నేను కట్టుకుంటుంటాను. ‘అంచు చీరలు నీవేం కట్టుకుంటావు, పెద్దదానిలా’ అంటుంది. కానీ, బ్లౌజ్ డిజైన్‌తో స్టైలిష్ లుక్ తీసుకువస్తాను. దీంతో అమ్మ కూడా ఆశ్చర్యపోతూ ‘చాలా బాగుంది’ అని కితాబు ఇచ్చేస్తుంది. పండగలు, కుటుంబ ఫంక్షన్లు, వేడుకలకు సందర్భానికి తగినట్టు లంగాఓణీలు, పట్టుచీరలు అన్నీ ప్రయత్నిస్తాను.భిన్నంగా ఉండాలని..రచయిత్రి అనగానే ముతక చీరలు, కళ్లద్దాలు ఉండాలని చాలా మంది అనుకునేవారు. కానీ, నా వార్డ్రోబ్ మాత్రం వాటన్నింటికన్నా భిన్నం. రచయిత్రులు అంటే ఇలాగే ఉండాలి అనే ఆలోచనల్లోనుంచి ఒక మార్పు తీసుకురావాలని బుక్ లాంచింగ్ వంటి కార్యక్రమాలకు జీన్స్, టాప్స్ ట్రై చేస్తుంటాను. ప్రతీ రోజూ కొత్తగా ఉండాలనుకుంటాను. ఏ డ్రెస్ వేసుకొని రెడీ అవుతామో ఆ రోజు ఆ డ్రెస్ ప్రభావం మన మీద ఉంటుంది.ఫ్యాషన్ షోలు..దేశ, విదేశాల్లోనూ ఫ్యాషన్ షోలు నడుస్తుంటాయి. వాటిలో ప్రసిద్ధ డిజైనర్లు సీజన్‌ని బట్టి కలర్, డిజైన్ థీమ్‌ని పరిచయం చేస్తుంటారు. వాటి కోసం ఆన్లైన్ సెర్చింగ్‌తో పాటు, ఫ్యాషన్ మ్యాగజీన్స్ కూడా చూస్తుంటాను. ఆ కలర్ డ్రెస్ కాంబినేషన్స్ నేనూ ప్రయత్నిస్తుంటాను. ఎక్కువగా మాత్రం బ్లాక్ అండ్ వైట్ కలర్స్ ఇష్టపడతాను. ఆ కాంబినేషన్ డ్రెస్సులు కూడా చాలానే ఉన్నాయి నా దగ్గర’’ అంటూ వార్డ్రోబ్ విశేషాలను షేర్ చేసుకుంది. – నిర్మలారెడ్డి -
కడలి దిశగా కృష్ణమ్మ పరుగులు
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురిసౌత్/తాడేపల్లి రూరల్/పోలవరం రూరల్: కృష్ణమ్మ కడలి వైపు కదలిపోతోంది. విజయవాడ వద్దనున్న ప్రకాశం బ్యారేజీల్లోకి గురువారం సాయంత్రం 6 గంటలకు 3,10,088 క్యూసెక్కులు చేరుతోంది. బ్యారేజ్ వద్ద నీటి మట్టం 12 అడుగులకు చేరుకుంది. కృష్ణా డెల్టా కాలువలకు 13,768 క్యూసెక్కులను అధికారులు విడుదల చేస్తున్నారు. మిగులుగా ఉన్న 2,96,320 క్యూసెక్కులను 17 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఎగువ నుంచి కృష్ణా నది, ఉప నది తుంగభద్రల్లో వరద కొనసాగుతోంది.ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌ల నుంచి 2.08 లక్షల క్యూసెక్కులు, తుంగభద్ర డ్యామ్ నుంచి 60 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 3,54,761 క్యూసెక్కులు వస్తున్నాయి. ఇక్కడ 882.5 అడుగుల్లో 202.04 టీఎంసీలను నిల్వ చేస్తూ 3.72 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. బ్యాక్‌వాటర్ నుంచి హంద్రీ–నీవా సుజల స్రవంతికి 211 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 25 వేల క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,400 క్యూసెక్కులు విడుదల చేశారు.నాగార్జున సాగర్‌లోకి 2,72,750 క్యూసెక్కులు చేరుతుండగా.. 586 అడుగుల్లో 300.32 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు. నాగార్జున సాగర్ నుంచి 2.53 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులోకి 2.58 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 35.5 టీఎంసీలను నిల్వ చేస్తూ 2.46 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పోలవరం వద్ద పెరుగుతున్న గోదావరి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఏలూరు జిల్లా పోలవరం వద్ద గోదావరి వరద మళ్లీ పెరుగుతోంది. ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద నీటి మట్టం 31.6 మీటర్లకు చేరింది. స్పిల్‌వే నుంచి దిగువకు 7.77 లక్షల క్యూసెక్కులు దిగువకు వెళ్తోంది. భద్రాచలం వద్ద కూడా 37.50 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. ధవళేశ్వరం వద్ద గోదావరి వరద స్థిరంగా కొనసాగుతోంది.గురువారం సాయంత్రం 6 గంటలకు ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 6,96,462 క్యూసెక్కులు చేరుతుండగా.. గోదావరి డెల్టా కాలువలకు 7,500 క్యూసెక్కులు విడుదల చేస్తున్న అధికారులు.. మిగులుగా ఉన్న 6,88,962 క్యూసెక్కులను 175 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. ప్రస్తుత నీటి సంవత్సరంలో అంటే జూన్ 1 నుంచి గురువారం ఉదయం వరకూ ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 1800.71 టీఎంసీల గోదావరి జలాలు, ప్రకాశం బ్యారేజ్ నుంచి 14.94 టీఎంసీల కృష్ణా జలాలు సముద్రంలో కలిశాయి.మిడతపాట్లు వేలేరుపాడు: గోదావరి వరదలో మునగకుండా ప్రాణాలు కాపాడుకునేందుకు మిడతలు ఇలా ఊత పుల్లల పైకి ఒకదాని వెనుక మరొకటి ఎక్కాయి. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం తాట్కూరుగొమ్ము గ్రామంలో గురువారం కనిపించిన దృశ్యాలివి.. -
కడలి వైపు కృష్ణమ్మ పరుగులు
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: కడలి వైపు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. ప్రకాశం బ్యారేజ్‌లోకి బుధవారం సా.6 గంటలకు 1లక్షా 51వేల క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టా కాలువలకు 13,500 క్యూసెక్కులు విడుదల చేస్తున్న అధికారులు.. మిగులుగా ఉన్న 1,37,450 క్యూసెక్కులను 50 గేట్లను మూడు అడుగులు, 20 గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నారు. బ్యారేజ్‌లోకి గురువారం కూడా ఇదే రీతిలో వరద కొనసాగనుంది.మరోవైపు.. నాగార్జునసాగర్ నుంచి పులిచింతల ప్రాజెక్టులోకి 3.74 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. ఇక్కడ 37.10 టీఎంసీలను నిల్వచేస్తూ దిగువకు 1.06 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. అలాగే, శ్రీశైలం ప్రాజెక్టులోకి 3.32 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 882.8 అడుగుల్లో 203.42 టీఎంసీలు నిల్వచేస్తూ పది గేట్లు ఎత్తి, విద్యుదుత్పత్తి చేస్తూ 4.03 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌లోకి 3.50 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 584.6 అడుగుల్లో 296.28 టీఎంసీలు నిల్వచేస్తూ గేట్లు ఎత్తి, ప్రధాన కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 2.70 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు.కృష్ణా ప్రధాన పాయ నుంచి ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లలోకి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ఆ రెండింటి నుంచి దిగువకు రెండు లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. తుంగభద్ర డ్యామ్‌లోకి 59 వేల క్యూసెక్కులు చేరుతుండగా.. 103.74 టీఎంసీలు నిల్వచేస్తూ 60 వేల క్యూసెక్కులను వదులుతున్నారు. ఈ నేపథ్యంలో.. గురువారం కూడా శ్రీశైలంలోకి వరద ఉధృతి ఇదే రీతిలో కొనసాగనుంది. మరోవైపు.. ఉమ్మడి కృష్ణాజిల్లాలో వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పత్తి, పెసర, మొక్కజొన్న పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉధృతి పెరుగుతుండటంతో ప్రకాశం బ్యారేజీకి ఎగువ, దిగువ ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేశారు. స్వల్పంగా పెరుగుతున్న గోదావరి..ఇదిలా ఉంటే.. గోదావరి వరద స్వల్పంగా పెరుగుతోంది. నదీ పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న భారీవర్షాలతో ఉప నదుల నీరు, కొండవాగుల నీరు క్రమేపీ నదిలోకి చేరుతుండటంతో వరద ఉధృతి పెరుగుతోంది. ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద 30.800 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. స్పిల్‌వే నుంచి 6.24 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు చేరుతోంది. ఎగువన భద్రాచలం వద్ద కూడా గోదావరి వరద పెరుగుతూ 35.3 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో వరద మరికొంత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వాగులు పొంగి ప్రవహిస్తున్నందున చింతూరు మండలంలో 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వీఆర్‌పురం మండలంలో అన్నవరం వాగు పొంగి వరదనీరు రహదారి పైనుండి ఉధృతంగా ప్రవహించింది. వరినాట్లు నిమిత్తం అవతలి పక్కకు వెళ్లిన వ్యవసాయ కూలీలు తిరుగుమార్గంలో ప్రాణాలకు తెగించి వాగును దాటారు. -
డైరెక్టర్ మణిరత్నంకు థ్యాంక్స్ చెప్పిన యంగ్ హీరో
తమిళ సినిమా: గౌతమ్ కార్తీక్ ఇటీవలే నటి మంజిమా మోహన్‌ను పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాడయ్యారు. తాజాగా నటుడిగా మరో మైలురాయిని కూడా టచ్ చేశారు. సీనియర్ నటుడు కార్తీక్ వారసుడిగా 2012లో మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన కడల్ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయమయ్యారు. అలా నటుడిగా 10 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా గౌతమ్ కార్తీక్ తాజాగా నటిస్తున్న క్రిమినల్ చిత్ర షూటింగ్లో యూనిట్ వర్గాలు కేక్ కట్ చేసి వేడుకలు చేశారు. ఈ సందర్భంగా గౌతమ్ కార్తీక్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ తనపై నమ్మకంతో మంచి అవకాశాన్ని కల్పించిన దర్శకుడు మణిరత్నంకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తన ఈ సినీ ప్రయాణం ఉత్సాహంగానూ, ఉన్నతంగానూ, భయంగానూ, చాలెంజ్ గానూ, అద్భుతంగానూ, కొత్త విషయాలను నేర్చుకునే విధంగా ఉందన్నారు. నటుడిగా విజయాలు, అపజయాలు ఇచ్చిన అనుభవంతో ఇకపై మంచి చిత్రాలతో అలస్తారని గౌతమ్ కార్తీక్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈయన 1947, పత్తుతల, క్రిమినల్ తదితర చిత్రాల్లో నటిస్తున్నారు. -
కాదలి... అంటే ఏంటి?
ప్రేమ.. ఇష్క్.. కాదల్... భాష మారుతుందేమో కానీ భావం ఎప్పుడూ మారదు. ఏ భాషలో చెప్పినా ప్రేమ ప్రేమే. అందుకే, ఎన్ని ప్రేమకథలొచ్చినా ప్రేక్షకులెప్పుడూ ఆసక్తి కనబరుస్తారు. వాళ్ల ఆసక్తిని మరింత పెంచుతూ... ‘కాదలి’ చిత్ర బృందం సరికొత్త ప్రచారంతో ఆకట్టుకుంటోంది. హరీశ్ కల్యాణ్, సాయి రోనక్, పూజ కె.దోషి ముఖ్యతారలుగా అనగనగన ఫిల్మ్ కంపెనీ (ఏఎఫ్సీ) పతాకంపై పట్టాభి ఆర్.చిలుకూరి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా ‘కాదలి’. తమిళంలో ‘కాదలి’ అంటే ప్రేయసి. మరి.. ఈ టైటిల్ తెలుగు సినిమాకి పెట్టడం వెనక ఆంతర్యం ఏంటి? అనేది త్వరలో తెలుస్తుంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. ‘‘ఓ అమ్మాయి, ఇద్దరు అబ్బాయిల మధ్య జరిగే ప్రేమకథే ఈ సినిమా. ప్రముఖ నిర్మాత డి. సురేశ్‌బాబుగారి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న చిత్రమిది’’ అన్నారు పట్టాభి ఆర్.చిలుకూరి. సుదర్శన్, భద్రమ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు: వనమాలి, సంగీతం: ప్రసన్న ప్రవీణ్ శ్యాం, కెమేరా: శేఖర్ వి.జోసెఫ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఆనంద్ రంగ. -
కొలువుదీరిన వంశవృక్షం
ఐదుతరాల ‘కంచర్ల’ అనుబంధం ఒకేచోట కలసిన 250 మంది కుటుంబ సభ్యులు కడలి(రాజోలు) : ఐదు తరాల వంశవృక్షం ఒకేచోట కలిసింది. వారి ఆనందానికి అవధులు లేవు. శుక్రవారం కడలి గ్రామంలో కంచర్ల సోమరాజు, సత్యవతి వంశానికి చెందిన ఐదు తరాలకు చెందిన 250 మంది కలుసుకున్నారు. కంచర్ల సోమరాజు, సత్యవతిలకు నలుగురు కుమారులు వెంకన్న, సుబ్బయ్య, పూర్ణచంద్రరావు, కాశీ, ఆరుగురు కుమార్తెలు ఉన్నారు. వారి సంతానం సుమారు 250 మంది కడలి గ్రామం వచ్చారు. సంక్రాతి పండుగ సందర్భంగా దేశ, విదేశాల్లో ఉన్న కంచర్ల కుటుంబీకులు ఈ ఏడాది కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. గత ఏడాది నుంచి కంచర్ల సోమశేఖర్గుప్త కుటుంబీకులను ఒకచోట చేర్చేందుకు చేపట్టిన కృషికి కుటుంబ సభ్యులంతా సహకరించారు. దీంతో అమెరికా, దుబాయి, సింగపూర్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, విశాఖపట్టణం తదితర ప్రాంతాలకు చెందిన అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు, పెదనాన్నలు, చిన్నాన్నలు అంతా కడలి గ్రామం చేరుకున్నారు. దీంతో కడలిలో పండగ వాతావరణం నెలకొంది. దీనికోసం ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసి కంచర్ల కుటుంబీకులు ఆటలు, పాటలతో ఆనందాన్ని పంచుకున్నారు. పెళ్లిళ్లకు, పండగలకు కొద్దిమంది కలిసేవాళ్లమని, ఒకేసారి కుటుంబ సభ్యులంతా ఇలా కలవడం చాలా ఆనందంగా ఉందని శేఖర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. -
అరవిందస్వామితో మిల్కీబ్యూటీ
చిన్న విరామం తరువాత రీ ఎంట్రీ ఇచ్చిన నటుడు అరవిందస్వామి అటు విలన్‌గా, ఇటు హీరోగా యమ బిజీ అరుు పోయారు. మణిరత్నం కడలి చిత్రంతో నటుడిగా పునఃప్రవేశం చేసిన ఈ నటుడు ఆ తరువాత తనీఒరువన్ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో దుమ్మురేపారు. ఆ తెలుగు రీమేక్‌లోనూ రామ్‌చరణ్‌కు విలన్‌గా మారారు. దీంతో మళ్లీ కథానాయకుడిగా అవకాశాలు వరుస కడుతున్నారుు. ఇప్పటికే చతురంగవేటై్ట-2 చిత్రంలో హీరోగా నటిస్తున్న అరవిందస్వామికి తాజాగా మరో అవకాశం తలుపుతట్టినట్టు సమాచారం. ఇక అవకాశాలు తెరమరుగయ్యారుు అనుకున్న నటి తమన్నాను బాహుబలి చిత్రం అనూహ్యంగా ఆకాశానికి ఎత్తేసింది. అదే విధంగా తోళా, ధర్మదురై, దేవి చిత్రాలు వరుసగా విజయం సాధించడంతో ముఖ్యంగా కోలీవుడ్‌లో తన క్రేజ్‌ను పెంచుకున్న తమన్న విశాల్‌తో నటించిన కత్తిసండై పొంగల్ రేస్‌కు సిద్ధం అవుతోంది. ప్రస్తుతం బాహుబలి-2, తమిళంలో శింబుకు జంటగా అన్బాదవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రంలోనూ నటిస్తున్నారు.తాజాగా అరవిందస్వామితో రొమాన్‌సకు రెడీ అవుతున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. వీరిద్దరు జంటగా దర్శకుడు సెల్వ ఒక చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇంతకు ముందు నాన్ అవనిల్లై, దానికి సీక్వెల్ అంటూ హిట్ చిత్రాలను తెరకెక్కించిన ఈ దర్శకుడు మరోసారి అదే తరహా రొమాంటిక్ చిత్రాన్ని రూపొందిండానికి రెడీ అవుతున్నారు. ఇందులో ఐదుగురు కథానారుుకలు ఉంటారట. అందులో లీడ్ పాత్రకు నటి తమన్నాను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇక ప్రతినాయకి పాత్రలో నటి ఇనియ నటించనున్నారట. మరో ముగ్గురు నారుుకల ఎంపిక జరుగుతోందని, చిత్రాన్ని జనవరిలో ప్రారంభించనున్నట్లు సమాచారం. -
డియర్ డాడ్
‘రోజా’, ‘బొంబాయి’ చిత్రాలతో తెలుగు, తమిళ ప్రేక్షకులనే కాకుండా అటు బాలీవుడ్‌ను కూడా తన వైపు తిప్పుకున్నారు హీరో అరవింద్ స్వామి. అప్పట్లో లవర్‌బోయ్‌గా అందరినీ ఆకట్టుకున్న ఆయన తమిళ చిత్రాలతో బిజీ అయిపోవడంతో హిందీ చిత్రాలపై దృష్టి సారించలేదు. చాలా విరామం తర్వాత ‘కడలి’ చిత్రంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎంటరయ్యారు అరవింద్ స్వామి. తాజాగా ‘తని ఒరువన్’ చిత్రంతో విలన్‌గా న్యూ ఎంట్రీ ఇచ్చారు. అలాగే, పదిహేనేళ్ల తర్వాత బాలీవుడ్ తెరపై కనిపించ డానికి సిద్ధమవుతున్నారు. ‘రాజా కో రాణీ సే ప్యార్ హో గయా’ తర్వాత ఆయన హిందీలో మళ్లీ నటించలేదు. ఇప్పుడు ‘డియర్ డాడ్’ అనే టైటిల్‌తో రూపొందుతోన్న చిత్రంలో అరవింద్ స్వామి ఓ 14 ఏళ్ల బాలుడి తండ్రిగా కనిపించనున్నారు. ఓ రోడ్ ట్రిప్‌లో తండ్రీకొడుకులకు మధ్య ఎదురైన అనుభవాల సమాహారంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. -
కడలి అందాలు చూడాలనిపిస్తే..!
సముద్రంలో ఉన్న అందాలు చూడాలంటే...? అదీ సొంత వెహికల్లో వెళ్తే ఆ మజానే వేరు కదా! ఈ కలలు త్వరలోనే నిజం కానున్నాయి. సముద్రంలో ప్రయాణించేందుకు వీలుగా ఫెరారీ కారులా కనిపించే ఈ సబ్‌మెరైన్ పేరు హెచ్‌పీ స్పోర్ట్స్ సబ్ 2. ఇద్దరు మాత్రమే కూర్చునేందుకు వీలున్న ఈ సబ్‌మెరైన్‌తో సముద్రంలో 300అడుగుల వరకు వెళ్లొచ్చట. కారును పోలివుండే దీన్ని ఒక్కసారి రీచార్జ్ చేసుకుంటే సుమారు 6గంటల పాటు సముద్ర గర్భంలో షికారు చేయొచ్చట. టచ్ స్క్రీన్‌పై అలా టచ్ చేస్తూ నడపగల ఈ వాహనం ఖరీదెంతో తెలుసా?... జస్ట్ రూ.6.8 కోట్లు ఉంటుందని అంచనా.