అరవింద్ స్వామి.. ఈయన పేరు చెప్పగానే రోజా, బాంబే, ధృవ సినిమాలు గుర్తొస్తాయి. మొదటి రెండు సినిమాల్లో హీరోగా చేసిన ఈయన తర్వాతి కాలంలో విలన్‌గా మారాడు. సినిమాల్లోనే కాకుండా బిజినెస్‌లోనూ పేరు ప్రఖ్యాతలు గడించిన ఆయన తండ్రి ఎవరంటే చాలామంది వెంకటరామ దొరై స్వామి పేరు చెప్తారు. కానీ అరవింద్ స్వామి అసలు తండ్రి సింగం నటుడు డిల్లీ కుమార్. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పుకొచ్చాడు.
అరవింద్ నా కన్న కొడుకు
అరవింద్ తన కన్నకొడుకు అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఆయన మాట్లాడుతూ.. 'అరవింద్ స్వామి నా కొడుకు. కానీ మా మధ్య తండ్రీకొడుకుల బంధమనేదే లేదు. అతడు పుట్టగానే నా చెల్లెలికి దత్తత ఇచ్చాను. అప్పటి నుంచి అరవింద్ ఆ కుటుంబంలోని వ్యక్తిగానే పెరిగాడు. ఏదైనా ప్రధానమైన ఫంక్షన్స్ ఉంటే మాత్రమే నా ఇంటికి వచ్చేవాడు. ఇలా వచ్చి అలా వెళ్లిపోయేవాడు. మేమిద్దరం తండ్రీకొడుకుల అనుబంధాన్ని పెంచుకోలేదు అని చెప్పుకొచ్చాడు.
కెరీర్ తొలినాళ్లలోనే నిజం చెప్పేసిన హీరో
కాగా అరవింద్ స్వామి దళపతి సినిమాతో వెండితెరపై రంగప్రవేశం చేశాడు. ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలో తమిళంలో మెట్టియోలి అనే సీరియల్ ప్రసారమైంది. ఇందులో డిల్లీ కుమార్ నటించాడు. ఆ సమయంలో అరవింద్ స్వామి తన తండ్రి డిల్లీ కుమార్ అని ప్రకటించాడు. తర్వాత ఎక్కడా తన తండ్రి గురించి ప్రస్తావించలేదు. అంతేకాదు, వీరిద్దరూ కలిసి దిగిన ఫోటో ఒక్కటంటే ఒక్కటి కూడా ఎక్కడా కనిపించలేదు.
ఇన్నాళ్లకు పెదవి విప్పిన నటుడు
వీరు ఒకరి గురించి మరొకరు మాట్లాడుకోకపోవడమే కాకుండా ఎక్కడా కలిసి నటించకపోవడం గమనార్హం. ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు అరవింద్ గురించి ఓపెన్‌గా మాట్లాడాడు డిల్లీ కుమార్. కథ కుదిరితే అరవింద్‌తో నటించేందుకు కూడా సిద్ధమేనంటున్నాడు. ఇకపోతే అరవింద్‌ను వి.డి.స్వామి-వసంత దంపతులు దత్తత తీసుకుని పెంచుకున్నారు.
చదవండి: ఓటీటీలో భోళా శంకర్.. ఐదు భాషల్లో ఈ వారమే స్ట్రీమింగ్..
Comments
Please login to add a commentAdd a comment