
నయనతార – విఘ్నేష్ శివన్ ప్రేమలో ఉన్నారు. ఆ విషయాన్ని అధికారికంగా బయటపెట్టకపోయినా వాళ్ల ప్రేమను మాత్రం వీలున్నప్పుడల్లా బయటపెడుతూనో, బయటపడుతూనో ఉంటారు. హాలీడేయింగ్, ఒకరి పుట్టినరోజు ఒకరు జరపడం. ఒకరికి హిట్ వస్తే ఇంకొకరు సెలబ్రేట్ చేసుకోవడంలాగా అన్నమాట. బుధవారం విఘ్నేష్ బర్త్‌డే. బాయ్‌ఫ్రెండ్ బర్త్‌డే పార్టీను ఫ్రెండ్స్‌తో కలిసి ఘనంగా చేశారు నయనతార. ఈ ఫంక్షన్‌కు డ్రెస్ కోడ్ బ్లాక్ అండ్ బ్లాక్. దర్శకుడు అట్లీ, సంగీత దర్శకుడు అనిరు«ద్, నటుడు అరవింద్ స్వామి, హీరో విజయ్ సేతుపతి మరికొందరు ఈ పార్టీకు హాజరయ్యారు. ఇటీవలే విఘ్నేష్ నిర్మాణంలో నయనతార హీరోయిన్‌గా ఓ సినిమా ప్రారంభం అయింది.