ఆస్కార్‌ 2022కి వెళ్లనున్న నయనతార మూవీ | Tamil Movie Koozhangal Selected for Indias Official Entry of Oscars 2022 | Sakshi
Sakshi News home page

భారత్‌ నుంచి ఆస్కార్‌​కి వెళ్లనున్న తమిళ చిత్రం ‘కూజాంగల్’

Published Sat, Oct 23 2021 8:38 PM | Last Updated on Sat, Oct 23 2021 8:40 PM

Tamil Movie Koozhangal Selected for Indias Official Entry of Oscars 2022 - Sakshi

ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డు ‘ఆస్కార్‌’. ఒక్కసారైనా ఈ అవార్డుని సాధించాలని ప్రతి ఫిల్మ్‌ మేకర్‌ కోరుకుంటారు. అలాంటి ఫేమ్‌ ఉన్న ఈ అవార్డు కార్యక్రమం మార్చి 2022న లాస్‌ ఎంజెల్స్‌లో జరగనుంది. ఈ అవార్డుకి అంతర్జాతీయ చలనచిత్ర కేటగిరీ తమిళ చిత్రం ‘కూజాంగల్’ ఎంపికైంది.

కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 15 మంది సభ్యుల  జ్యూరీ మన దేశం నుంచి ఆస్కార్‌ నామినేషన్‌కు వెళ్లదగ్గ  మొత్తం 14 సినిమాలను వీక్షించింది. అందులో ఈ సినిమాను ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. పీఎస్‌ వినోద్‌రాజ్‌ దర్శకుడిగా పరిచయమైన ఈ మూవీని రౌడీ పిక్చర్స్ బ్యానర్‌పై నటి నయనతార, డైరెక్టర్‌ విఘ్నేష్ శివన్ నిర్మించారు. 

విదేశి ఉత్తమ మూవీ కేటగిరీలో ఆస్కార్‌ నామినేషన్స్‌కి పోటీపడుతున్నట్లు సోషల్‌ మీడియా వేదిక ఈ చిత్ర నిర్మాత విఘ్నేష్‌ షేర్‌ చేసుకున్నాడు. ‘‘అండ్‌ ది ఆస్కార్స్‌ గోస్‌ టు..’ అనే పదం వినేందుకు మరో రెండు అడుగుల దూరంలో ఉ‍న్నాం. ఎంతో ఆనందంగా ఉంది’ అని ఈ ఫిల్మ్‌ మేకర్‌ తెలిపాడు.

చదవండి: ప్రియుడితో కలిసి దేవాలయాలను సందర్శించిన నయనతార

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement