మణి సినిమాలో ధృవ కాంబినేషన్ | arvind swamy in ramcharan mani ratnam Movie | Sakshi
Sakshi News home page

మణి సినిమాలో ధృవ కాంబినేషన్

Published Fri, Mar 10 2017 12:06 PM | Last Updated on Tue, Sep 5 2017 5:44 AM

మణి సినిమాలో ధృవ కాంబినేషన్

మణి సినిమాలో ధృవ కాంబినేషన్

ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పీరియాడిక్ డ్రామాలో నటిస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆ తరువాత చేయబోయే సినిమాను కూడా లైన్లో పెట్టాడు. ఎప్పటి నుంచో కలలు కంటున్నట్టుగా లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తన నెక్ట్స్ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు చెర్రీ. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయన్న టాక్ వినిపిస్తోంది.

జూన్ నుంచి ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే క్రేజీ కాంబినేషన్ అనిపించుకుంటున్న ఈ సినిమాకు ఇంట్రస్టింగ్ కాస్టింగ్ను సెట్ చేస్తున్నారు. మణిరత్నం వెండితెరకు పరిచయం చేసిన మిల్కీ బాయ్ అరవింద్ స్వామి.. రామ్ చరణ్, మణిల సినిమాలో కీలక పాత్రలో నటించనున్నాడు. ఇప్పటికే ధృవ సినిమాలో ఆకట్టుకున్న చెర్రీ, అరవింద్ స్వామిలు మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోవటం ఆసక్తికరంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement