మహా జాదూ జోడీ! | Arvind Swamy re entry with Saduranga vettai -2 | Sakshi
Sakshi News home page

మహా జాదూ జోడీ!

Published Fri, Nov 11 2016 10:57 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 PM

మహా జాదూ జోడీ!

మహా జాదూ జోడీ!

అరవింద్ స్వామి హీరోగా నటించిన ‘బొంబాయి’ సినిమా విడుదలై ఇరవై ఏళ్లు దాటింది. అప్పుడు త్రిషకి పదమూడేళ్లు. ఇద్దరి మధ్య వయసులో వ్యత్యాసం కూడా పదమూడేళ్లే. అప్పటికి ఆమె హీరోయిన్ కూడా కాలేదు. ‘జోడీ’తో యాక్టర్‌గా త్రిష కెరీర్ స్టార్ట్ చేసే టైమ్‌కి అరవింద్ స్వామి ఆల్మోస్ట్ సినిమాలకు దూరం కావాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత సినిమాల నుంచి దూరంగా వెళ్లారు కూడా.

నటుడిగా రీ-ఎంట్రీ ఇచ్చిన అరవింద్ స్వామి, పదమూడేళ్లుగా హీరోయిన్‌గా కంటిన్యూ అవుతున్న త్రిష ఇప్పుడు జంటగా నటిస్తున్న సినిమా ‘సదురంగ వేట్టై-2’. బుధ వారం చిత్రీకరణ మొదలైంది. మీరు చూస్తున్న ఫొటో ఈ సినిమా ఫస్ట్ లుక్కే. హ్యాండ్సమ్ అరవింద్ స్వామితో షూటింగ్ చేయడం హ్యాపీగా ఉందని ఈ సందర్భంగా త్రిష పేర్కొన్నారు. తమిళ చిత్రం ‘సలీమ్’ ఫేమ్ నిర్మల్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఈ ఇద్దరూ మహా జాదూ జోడీగా కనిపించనున్నారట. టెక్నాలజీ సహాయంతో ఓ ఘరానా దొంగ ఎటువంటి మోసాలు చేశాడనేది సినిమా కథ అని చిత్ర బృందం చెబుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement