రీమేక్‌ రాజా? | Ravi Teja to remake Jayam Ravi's Bogan in Telugu | Sakshi
Sakshi News home page

రీమేక్‌ రాజా?

Published Sat, Mar 25 2017 11:37 PM | Last Updated on Tue, Sep 5 2017 7:04 AM

రీమేక్‌ రాజా?

రీమేక్‌ రాజా?

మాస్‌ మహారాజా రవితేజను రీమేక్‌ రాజా చేయాలని తమిళ దర్శకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఎప్పటికప్పుడు రవితేజ రెడ్‌ సిగ్నల్‌ చూపిస్తున్నారు. ‘టచ్‌ చేసి చూడు’, ‘రాజా ది గ్రేట్‌’ సినిమాలు సెట్స్‌ మీదకు వెళ్లకముందు... ‘జిల్లా’, ‘కణిదన్‌’ తదితర తమిళ చిత్రాల రీమేక్స్‌లో రవితేజ నటిస్తారని చెన్నై కోడంబాక్కమ్‌ వర్గాలు కన్ఫర్మ్‌ చేశాయి. కానీ, అవేవీ పట్టాలు ఎక్కలేదు.

 తాజాగా లక్ష్మణ్‌ దర్శకత్వంలో ‘జయం’ రవి, అరవింద్‌ స్వామి నటించిన ‘బోగన్‌’ను తెలుగులో రవితేజ హీరోగా రీమేక్‌ చేయాలను కుంటున్నారని చెన్నై నుంచి కబురొచ్చింది. ‘‘తెలుగులోనూ లక్ష్మణే దర్శకత్వం వహిస్తారు. ‘జయం’ రవి పాత్రకు రవితేజను, అరవింద్‌ స్వామికి మరో ప్రముఖ నటుణ్ణి సంప్ర దించారు. ఆగస్టులో షూటింగ్‌ ప్రారంభమయ్యే ఛాన్సుంది’’ అని కోలీవుడ్‌ టాక్‌. మరి, రవితేజ ఈ రీమేక్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తారా? రెడ్‌ సిగ్నల్‌ చూపిస్తారా? వెయిట్‌ అండ్‌ సీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement