Bogan Remake
-
మాస్ మహారాజ్‌తో తాన్య..!
లాంగ్ గ్యాప్ తరువాత వరుస సినిమాలకు కమిట్ అవుతున్న మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. పటాస్ ఫేం అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజా ది గ్రేట్ షూటింగ్ ఇప్పటికే పూర్తి కావచ్చింది. ఈ సినిమాతో పాటు టచ్ చేసి చూడు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత ఓ తమిళ సినిమా రీమేక్‌కు రెడీ అవుతున్నాడు రవితేజ. కోలీవుడ్‌లో ఘనవిజయం సాధించిన భోగన్ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నాడు. ఒరిజినల్ వర్షన్‌కు దర్శకత్వం వహించిన లక్ష్మణ్ తెలుగు వర్షన్ దర్శకత్వ బాధ్యతలు కూడా తీసుకున్నాడు. ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉన్న ఈ సినిమాలో లీడ్ హీరోయిన్గా కేథరిన్ థెరిస్సా నటిస్తుండగా మరో కీలక పాత్రలో అప్పట్లో ఒకడుండేవాడు ఫేం తాన్య హోప్ నటించనుంది. అక్టోబర్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. -
రీమేక్ రాజా?
మాస్ మహారాజా రవితేజను రీమేక్ రాజా చేయాలని తమిళ దర్శకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఎప్పటికప్పుడు రవితేజ రెడ్ సిగ్నల్ చూపిస్తున్నారు. ‘టచ్ చేసి చూడు’, ‘రాజా ది గ్రేట్’ సినిమాలు సెట్స్ మీదకు వెళ్లకముందు... ‘జిల్లా’, ‘కణిదన్’ తదితర తమిళ చిత్రాల రీమేక్స్‌లో రవితేజ నటిస్తారని చెన్నై కోడంబాక్కమ్ వర్గాలు కన్ఫర్మ్ చేశాయి. కానీ, అవేవీ పట్టాలు ఎక్కలేదు. తాజాగా లక్ష్మణ్ దర్శకత్వంలో ‘జయం’ రవి, అరవింద్ స్వామి నటించిన ‘బోగన్’ను తెలుగులో రవితేజ హీరోగా రీమేక్ చేయాలను కుంటున్నారని చెన్నై నుంచి కబురొచ్చింది. ‘‘తెలుగులోనూ లక్ష్మణే దర్శకత్వం వహిస్తారు. ‘జయం’ రవి పాత్రకు రవితేజను, అరవింద్ స్వామికి మరో ప్రముఖ నటుణ్ణి సంప్ర దించారు. ఆగస్టులో షూటింగ్ ప్రారంభమయ్యే ఛాన్సుంది’’ అని కోలీవుడ్ టాక్. మరి, రవితేజ ఈ రీమేక్‌కి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? రెడ్ సిగ్నల్ చూపిస్తారా? వెయిట్ అండ్ సీ.