ఎవరీ నరకాసురుడు..? | Karthik Naren confirms Arvind Swamy for Narakasurudu | Sakshi
Sakshi News home page

ఎవరీ నరకాసురుడు..?

Published Tue, Jun 20 2017 11:12 AM | Last Updated on Tue, Sep 5 2017 2:04 PM

Karthik Naren confirms Arvind Swamy for Narakasurudu

ధృవంగ‌ల్ 16 సినిమాతో సూపర్ హిట్ కొట్టిన యువ దర్శకుడు కార్తీక్ నరేన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో ఇంట్రస్టింగ్ మూవీ నరకాసురుడు. ధృవ సినిమాతో నెగెటివ్ రోల్లో ఆకట్టుకున్న అరవింద్ స్వామి, ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. అరవింద్ స్వామి పుట్టిన రోజు సందర్భంగా చిత్రయూనిట్ టైటిల్ లోగోను రిలీజ్ చేశారు. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ సినిమాకు తమిళ్లో నరగసూరన్ అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా ఫాంటసీనా..? థ్రిల్లరా..? అన్న విషయం తెలియాల్సి ఉంది.

త్వరలో ప్రారంభం కానున్న ఈ సినిమాలో టాలీవుడ్ యువ కథానాయకుడు సందీప్ కిషన్ హీరోగా నటిస్తుండగా సీనియర్ స్టార్ శ్రియహీరోయిన్గా నటిస్తోంది. ప్రముఖ మలయాళ నటుడు ఇంద్రజిత్ మరో కీలక పాత్రలో అలరించనున్నాడు. అయితే ముందుగా ఈ కథను టాలీవుడ్ హీరో నాగచైతన్యతో రూపొందించాలని ప్లాన్ చేశారు... కానీ డేట్స్ అడ్జస్ట్ కాకపోవటంతో చైతు ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ ప్లేస్లో తెలుగు, తమిళ భాషల్లో మంచి గుర్తింపు ఉన్న సందీప్ కిషన్ను హీరోగా తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement