
నటుడు అరవిందస్వామి కథానాయకుడిగా నటించిన రెండగం చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 23వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. ప్రముఖ మలయాళ దర్శకుడు ఫెలివి తెరకెక్కించిన ఈ చిత్రం ద్వారా మలయాళ నటుడు కుంజాకో బోబన్ కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. తమిళం మలయాళం భాషల్లో రూపొందిస్తున్న ఈ చిత్రంలో నటి ఈషా రెబ్బా నాయికగా నటించగా జాకీ ష్రాప్, అనీష్ గోపాల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
దీన్ని నటుడు ఆర్య షాజినటేషన్ కలిసి నిర్మించడం విశేషం. గౌతమ్ శంకర్ చాయాగ్రహణ, అరుళ్ రాజ్ కెనడి సంగీతాన్ని అందించారు. యాక్షన్ కిల్లర్ జానర్‌లో రూపొందించిన కథా చిత్రం అని డైరెక్టర్ చెప్పారు. చిత్ర ట్రైలర్ ఇటీవల విడుదల చేయగా విశేష స్పందన వస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికే 14 లక్షల మంది ట్రైలర్ వీక్షించారని చెప్పారు. దీంతో చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయని.. వాటిని రెండగం చిత్రం కచ్చితంగా అధిగమిస్తుందనే నమ్మకం తమకు ఉందని దర్శకుడు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment