చతురంగ వేటై్ట-2 చిత్రానికి శ్రీకారం | Making the film caturanga vetaita -2 | Sakshi
Sakshi News home page

చతురంగ వేటై్ట-2 చిత్రానికి శ్రీకారం

Published Sat, Nov 12 2016 2:52 AM | Last Updated on Mon, Sep 4 2017 7:50 PM

చతురంగ వేటై్ట-2 చిత్రానికి శ్రీకారం

చతురంగ వేటై్ట-2 చిత్రానికి శ్రీకారం

చతురంగ వేటై్ట-2 చిత్రానికి పూజా కార్యక్రమాలతో శుక్రవారం శ్రీకారం చుట్టారు. ఇంతకు ముందు సీనియర్ నటుడు మనోబాలా నిర్మించిన చిత్రం చతురంగవేటై్ట. నటుడు నటరాజ్(నట్టి) హీరోగా నటించిన ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ చిత్రానికి సీక్వెల్‌గా చతురంగవేటై్ట-2 పేరుతో తాజా చిత్రం శుక్రవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. చతురంగవేటై్ట చిత్రాన్ని నిర్మించిన నటుడు మనోబాలనే ఈ చిత్రాన్ని కూడా తన పిక్చర్ హౌస్ పతాకంపై నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో అరవిందస్వామి కథానాయకుడిగానూ, ఆయనకు జంటగా నటి త్రిష నాయకిగానూ నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో రాధారవి, నాజర్, ప్రకాశ్‌రాజ్, పూర్ణ, మనోబాల, మయిల్‌సామి, ఆర్‌ఎన్‌ఆర్.మనోహర్, శ్రీమాన్, కమారవేల్ నటిస్తున్నారు. అశ్వమిత్ర సంగీతాన్ని, కేజీ.వెంకటేశ్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రానికి హెచ్.వినోద్ కథ, కథనం, మాటలను అందిస్తున్నారు. దర్శకత్వ బాధ్యతల్ని ఎన్‌వీ.నిర్మల్‌కుమార్ నిర్వహిస్తున్నారు. చిత్రం శుక్రవారం ఉదయం చెన్నైలో పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement