హీరోగా దూకుడు | hero aravind swami sign to unother movie | Sakshi
Sakshi News home page

హీరోగా దూకుడు

Oct 7 2016 11:05 PM | Updated on Sep 4 2017 4:32 PM

హీరోగా దూకుడు

హీరోగా దూకుడు

అరవింద్ స్వామి స్పీడు చూస్తుంటే.. ‘లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకోవాలి.

మంచి కథలు వస్తే చేసుకుంటూ వెళ్లడమే’ అన్నట్లుంది. వారం రోజుల్లో మూడు తమిళ సినిమాలకు సంతకం చేశాఅరవింద్ స్వామి స్పీడు చూస్తుంటే.. ‘లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకోవాలి. రాయన. ఆ మూడింటిలోనూ హీరో ఆయనే. ‘తని ఒరువన్’లో విలన్‌గా ప్రేక్షకుల్ని మెప్పించిన ఆయన ప్రస్తుతం హీరోగా దూకుడు చూపిస్తున్నారు. అరవింద్ స్వామి, త్రిష జంటగా తమిళ చిత్రం ‘సదురంగ వెట్టై’కి సీక్వెల్ రూపొందుతున్న విషయం తెలిసిందే.

ఇది కాకుండా నయనతారకు జోడీగా మలయాళ హిట్ సినిమా ‘భాస్కర్ ది రాస్కెల్’ తమిళ రీమేక్‌లో నటించనున్నారనే వార్త చెన్నైలో చక్కర్లు కొడుతోంది. ఈ రెండూ కాకుండా రమణ అనే తమిళ దర్శకుడితో ఓ చిత్రం చేయడానికి అంగీకరించారాయన. ఇందులో అరవింద్ స్వామికి జంటగా మలయాళీ కథానాయిక మంజు వారియర్ నటించనున్నారు. ఓ చిత్రం తర్వాత మరొకటి ఈ మూడూ సెట్స్‌పైకి వెళ్లనున్నాయట. ఈ చిత్రాల కోసమే అన్నట్టు ప్రస్తుతం అరవింద్ స్వామి జిమ్‌లో కండలు పెంచే పనిలో బిజీగా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement